Anudeep Kv: అంతుచిక్కని వ్యక్తిత్వం

నాన్న స్కూల్ లో హెడ్ మాస్టర్, అక్క తమ్ముడు గవర్నమెంట్ టీచర్స్.
కానీ ఇతను ఏమి చదువుకున్నాడో తెలియదు. ఒకసారి ఎం.బి.బి.స్ అంటాడు, ఇంకోసారి చార్టెడ్ అకౌటెంట్ అంటాడు, ఆ స్పెల్లింగ్ అడిగితే నేను ఎం.ఏ ఇంగ్లీష్ కాదు అంటాడు. ఒకసారి యోగ టీచర్. ఇంకోసారి చెఫ్. సరే చెఫ్ కదా రెండు గ్లాస్ లు రైస్ కి ఎన్ని గ్లాస్ లు నీళ్లు వెయ్యాలి అని అడిగితే. ఏ రైస్ కి బ్లాక్ రైసా, బ్రౌన్ రైసా, వైట్ రైసా అంటూ నవ్వుతూ ప్రశ్నను దాటేస్తాడు.

నేను మ్యాథ్స్ లో టాపర్ అంటాడు. (a+b)2 సూత్రం చెప్పండి అంటే
మంచి టాపిక్ గుర్తు చేసారు మీరు,(a+b)2 అనేది… a+b క్యూబ్ ఆ , స్క్వేరా అంటాడు,మెల్లగా నవ్వుతూ, మనం అందరికి తెలిసిన టాపిక్ మాట్లాడుదాం అంటాడు.

సినిమా ఇండస్ట్రీలో నిలద్రొక్కుకోవడానికి నానా కష్టాలు పడుతుంటాం అని చాలా మంది చెబుతుంటారు, కానీ అనుదీప్ మాత్రం నాకు పెద్దగా కష్టాలు ఏమి లేవండి, మళ్ళీ నేను చెప్పిన వాటికి బాక్గ్రౌండ్ వాయిస్ వేసి దీనంగా చూపించకండి అంటాడు.

- Advertisement -

సరే లెండి అనుదీప్ అనే పేరుకు ఏంటి అర్ధం అంటే, మా తాత పేరు అనుదీప్, ఆయన చనిపోయిన తర్వాత మా బామ్మ జ్ఞాపకార్థం ఆ పేరు పెట్టారు అంటాడు. ఇలాంటి ఉదాహరణలు చెప్పడానికి కోకొల్లలు.

అనుదీప్ లో మరో కోణం ఉంది..
అనుదీప్ చెప్పులు వేసుకోడు, దానికి కారణం “క్లింట్ ఒబెర్” రాసిన “ఎర్తింగ్” పుస్తకం చదివి, సింథటిక్ వచ్చిన తరువాత భూమికి, మనిషికి ఉన్న కనెక్టవిటి మిస్ అవుతుందని గ్రహించి చెప్పులు మానేసాడు.
లైఫ్ ను అందరు సీరియస్ తీసుకోండి అని చెబుతుంటారు.
కానీ సీరియస్ నెస్ అనేది ఒక డిసీజ్ లా అనిపిస్తుంది నాకు అంటాడు అనుదీప్.

ఒక సినిమా రాయడానికి అనుదీప్ రామ్ గోపాల్ వర్మను కలిసినప్పుడు నీ ఫేస్ విషాదంగా ఉంది, నువ్వు కామెడీ ఏమి రాస్తావ్ అన్నాడంట.
కానీ అనుదీప్ ఇప్పటికి వరకు చేసిన 3 సినిమాలు కామెడియే,
రేటింగ్స్ తో సంబంధం లేకుండా Imdb లో సినాప్సిస్ చదివి, భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూడటం అనుదీప్ కి అలవాటు.

చేసినవి కామెడీ సినిమాలే అయినా తనకు ఇష్టమైన డైరెక్టర్స్ మాత్రం.
కె.విశ్వనాధ్, చార్లీ చాప్లిన్, రాజకుమార్ సంతోషి, స్టీఫెన్ చౌ, వెంకట్ ప్రభు, షోయబ్ మన్సూర్ (పాకిస్థాన్ డైరెక్టర్) అని చెబుతాడు.
పుస్తకాలు అడిగితే
ఓషో – మెడిటేషన్ టూ మెడిటేషన్,
రంగనాయకమ్మ – జానకి విముక్తి
డి.వెంకట్రామయ్య కథలు
ఓషో – ఇంటిలిజెన్స్
తిలక్ కథలు అని చెబుతాడు.

పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనుదీప్, జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా రిలీజైన “ప్రిన్స్” చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోయినా పరవాలేదనిపించుకుంది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్న ప్రస్తుతం అనుదీప్ చేతిలో రెండు అవకాశాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ లో అనుదీప్ తన తదుపరి చిత్రాలు చెయ్యాల్సి ఉంది. విక్టరీ వెంకటేష్ హీరోగా అనుదీప్ సినిమాను చేయనున్నాడు. సినిమాలు హిట్ అయితే కానీ ఇంకో అవకాశం రాని తరుణంలో అనుదీప్ కి ఇలా వరుస అవకాశాలు రావడం విశేషమే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు