Anudeep: ఇంటర్వ్యూ రిలీజ్ అయింది మామ బానే ఉంది, మళ్ళీ నవ్వులే

Anudeep: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో అనుదీప్ కేవీ ఒకరు. అనుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా బీభత్సమైన హిట్ సాధిస్తే దానివలన దర్శకుడికి పేరుస్తుంది అని అనుదీప్ విషయంలో ఇది చాలా డిఫరెంట్ గా జరిగింది. సినిమా రిలీజ్ కంటే ముందే అనుదీప్ కి మంచి పేరు వచ్చింది. సుమ యాంకర్ గా కొనసాగే క్యాష్ అనే షోలో అనుదీప్ గెస్ట్ గా వచ్చాడు. అక్కడ అనుదీప్ టైమింగ్ చాలా మందిని ఆకట్టుకుంది.

వాస్తవానికి ఆ షో కి ఎవరో ఒక గెస్ట్ తక్కువ అయ్యారు. నాగ అశ్విన్ ఆ షో కి హాజరు కావలసి ఉంది. కానీ చివరి నిమిషంలో నాగి కుదరకపోవడం వలన దర్శకుడు అనుదీప్ హాజరయ్యాడు. ఆ షో మొదలైనప్పుడు చాలామంది నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ కోసం చూశారు. కానీ సర్ప్రైజింగ్ గా అనుదీప్ కామెడీ టైమింగ్ అందర్నీ ఆకట్టుకుంది. అది సినిమాకి ప్రేక్షకులను తీసుకురావడానికి కూడా ప్లస్ అయింది. ఇకపోతే జాతి రత్నాలు సినిమా విడుదలైన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఆ సినిమా ఎంతగా ఫేమస్ అయిందో ఆ తర్వాత అనుదీప్ ఇంటర్వ్యూస్ కూడా అంతే ఫేమస్ అయ్యాయి.

Anudeep

- Advertisement -

అనుదీప్ దర్శకత్వం వహించిన రెండవ సినిమా ప్రిన్స్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం అందరిని బాగానే ఆకట్టుకున్నాయి. ఇక్కడ కూడా ముఖ్యంగా అనుదీప్ ఇంటర్వ్యూస్ చాలా ఫన్ గా అనిపించాయి. ఆ తర్వాత అనుదీప్ చేసిన ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంటర్వ్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు ప్రస్తుతం ప్రియదర్శి నటించిన డార్లింగ్ అనే సినిమాకి ఒక ఇంటర్వ్యూను ఇచ్చాడు అనుదీప్. ఎప్పటిలానే ఈ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ గా మంచి ఫన్ గా కొనసాగింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో కింద అనుదీప్ ని ప్రశంసిస్తూ కామెంట్లు కూడా వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు