Anudeep Kv: ఇదెక్కడి ట్విస్ట్ మామ, విశ్వక్సేన్ తో అనుదీప్.?

Anudeep Kv: నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ జాతిరత్నాలు.ఈ సినిమాని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. ఫస్ట్ లుక్, ట్రైలర్‌లతోనే ఒక రకమైన క్యూరియసిటీ క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలక్షన్స్ రాబట్టింది. విడుదలకు ముందే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ సినిమా.. అదే రీతిలో బాక్సాఫీస్ వద్ద కూడా అదరగొట్టింది.

సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉండడంతో అందరూ.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. దీంతో బ్లాక్ బస్టర్ దిశగా జాతిరత్నాలు దూసుకుపోయింది. హిలేరియస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రిపీటెడ్‌ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించింది. ఇక అది అలా ఉంటే దర్శకుడు అనుదీప్‌ కేవీ ఒక్కసారిగా సూపర్ పాపులర్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత శివ కార్తికే ఎంతో ఫ్రెండ్స్ అనే సినిమాను తెరకెక్కించాడు అనుదీప్. ఈ సినిమా తెలుగులో మంచి రిజల్ట్ సాధించుకుంది కానీ తమిళ్లో మాత్రం ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

Anudeep to director Vishwak Sen

- Advertisement -

ఇక ప్రస్తుతం అనుదీప్ కేవీ రవితేజతో సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది అని చాలాచోట్ల కథనాలు వినిపించాయి. ఇక తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం అనుదీప్ విశ్వక్సేన్ హీరోగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ లో ఒక సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీని గురించి ఇంకా అధికారికి ప్రకటన రాలేదు. విశ్వక్సేన్ కి ఒక మంచి మాస్ ఇమేజ్ ఉంది. అటువంటి ఇమేజ్ ఉన్న ఒక హీరోతో అనుదీప్ ఎటువంటి కథను చేస్తాడు అని చాలామందికి ఒక రకమైన క్యూరియాసిటీ కూడా మొదలైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు