Anupam Kher : ప్రముఖ నటుడి ఆఫీస్ లో దొంగతనం… వీటిని ఎత్తుకెళ్లి ఏం చేస్తార్రా?

Anupam Kher : ప్రముఖ హిందీ నటుడు అనుపమ్ ఖేర్ ఆఫీసులో దొంగతనం జరిగింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే అనుపమ్ ఆఫీసు నుంచి ఆ దొంగలు ఎత్తుకెళ్లిన సామాన్లు తెలిస్తే తప్పకుండా షాక్ అవుతారు.

దొంగతనం ఎక్కడ జరిగిందంటే?

బాలీవుడ్ లో అనుపమ్ ఖేర్ దిగ్గజ నటుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక అనుపమ్ ఖేర్ కు ముంబైలోని పశ్చిమ శివారు ప్రాంతమైన అంధేరిలోని వీర దేశాయ్ రోడ్ ప్రాంతంలో ఆఫీసు ఉంది. ఆయన విలాసవంతమైన ఆఫీసులోకి దొంగలు చొరబడి విలువైన వస్తువులను అపహరించారు. ఆఫీసు తలుపులు పగలగొట్టి అక్కడున్న ముఖ్యమైన ఫైళ్లను కొట్టేసినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న అనుపమ్ ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ స్వయంగా తన కార్యాలయంలోని పరిస్థితిని వీడియో ద్వారా ఫాలోవర్స్ కు తెలియజేశారు.

Anupam Kher Files Complaint After Rs 4.15 Lakh Cash, Film's Negatives Get Stolen From His Office - News18

- Advertisement -

సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్

దొంగతనం జరిగిన తరువాత అనుపమ్ ఖేర్ దొంగలు తన ఆఫీసు తలుపులను ఎలా పగలగొట్టారు ? అక్కడికి వెళ్ళే సరికి ఆఫీసు ఎలాంటి పరిస్థితిలో ఉంది ? అనే విషయాలను వీడియో తీసి, దాన్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ ఘటన జూన్ 19న జరిగినట్లు సమాచారం.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనుపమ్ ఖేర్ ఈ చోరీ తర్వాత తన కార్యాలయాన్ని దొంగలు ధ్వంసం చేసిన వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ పోస్ట్‌లో నిన్న రాత్రి ఇద్దరు దొంగలు వీర దేశాయ్‌లోని నా ఆఫీసు తలుపు పగులగొట్టారని రాశారు. మా కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌ ఫైల్స్, డబ్బు, ఫిల్మ్ నెగటివ్‌లు మొత్తం ఒక పెట్టెలో ఉన్నాయి. ఈ వస్తువులనే వాళ్ళు ఎత్తుకెళ్లారు. మా కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్వరలోనే కేసును ఛేదించి దొంగలను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారని తెలిపారు. ఎందుకంటే సీసీటీవీలో ఇద్దరు దొంగలు లగేజీతో ఆటోలో కూర్చున్న దృశ్యం కనిపించింది. దేవుడు వారికి బుద్ధి ప్రసాదించును గాక. పోలీసులు రాకముందే ఈ వీడియోను నా సిబ్బంది చిత్రీకరించారు అంటూ అసలు దొంగలు ఏం కొట్టేశారు అనే విషయాన్ని అనుపమ్ వెల్లడించారు.

వాటినేం చేసుకుంటార్రా?!

అనుప్‌ఖేర్ పోస్ట్‌ని చూసిన అతని అభిమానులు చాలా మంది షాక్ అవుతున్నారు. ఆఫీసులో నగదు ఏమైనా చోరీకి గురైందా అని అడుగుతున్నారు. త్వరలోనే పోలీసులు దొంగలను పట్టుకుంటారు అంటూ అనుపమ్ ను టెన్షన్ పడొద్దని కోరుతున్నారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే దొంగలంటే నగలో లేదా డబ్బు ఎత్తుకెళ్లాలి. కానీ ఈ దొంగలేంటి విచిత్రం ఆయన అకౌంటు ఫైల్స్, ఫిల్మ్ నెగెటివ్ లు ఎత్తుకెళ్లారు? ని కామెంట్స్ చేస్తున్నారు. తప్పకుండా ఇదంతా ఎవరో కావాలనే ఆయనపై కోపంతో చేశారని అంటున్నారు. వాటిని ఎత్తుకెళ్ళి ఏం చేసుకుంటార్రా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు