Anupama: మరోసారి బెల్లంకొండ సరసన

Anupama: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోస్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. డిస్ప్లేన్ కి, డెడికేషన్ కి బెల్లంకొండ శ్రీనివాస్ ను కేరాఫ్ అడ్రస్ గా చెప్పొచ్చు. 2014లో అల్లుడు శీను సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్ అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. దర్శకుడు బాబి అందించిన కథను చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు వి వి వినాయక్. ఈ సినిమాలో బెల్లంకొండ సరసన సమంత హీరోయిన్ గా నటించింది.

బోయపాటి శ్రీను ఇచ్చిన కమర్షియల్ ఇమేజ్

అల్లుడు శ్రీను సినిమా తర్వాత స్పీడున్నోడు అనే సినిమాను చేశాడు శ్రీనివాస్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన “జయ జానకి నాయక” సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనమైన హిట్గా నిలిచింది. శ్రీనివాస్ లోని ఒక కమర్షియల్ హీరోని బయటకు తీసింది. అక్కడితో కెరీర్ సెట్ అయిపోద్ది అని అందరూ అనుకున్నారు.

 

- Advertisement -

 Bellamkonda Sreenivas

మళ్లీ వరుస డిజాస్టర్లు

జయ జానకి నాయక సినిమా తర్వాత వచ్చిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయాయి. సాక్ష్యం, కవచం, సీత ఈ సినిమాల తర్వాత తమిళ్లో సూపర్ హిట్ అయిన ఒక సినిమాను తెలుగులో రాక్షసుడు పేరుతో రీమిక్ చేశారు. తమిళ్ లో హిట్ అయినట్టుగా తెలుగులో కూడా ఈ సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమా ఊహించిన విజయాన్ని ఇవ్వలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన చత్రపతి సినిమా కూడా ఊహించిన స్థాయిలో ఆడలేదు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు థియేటర్లో ఆడకపోయినా కూడా యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ దాటుతాయి.

Anupama Parameswaran Biography: Age, Education, Career, Movies, Family,  Photos

మరొకసారి అనుపమతో

లేకపోతే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు అనే సినిమాను చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ అనే సినిమాను చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే బెల్లంకొండ శ్రీనివాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా అనుపమ నటించనున్నట్లు సమాచారం. ఇక అనుపమ విషయానికి వస్తే సిద్దు జొన్నలగడ్డ రీసెంట్ ఫిలిం టిల్లు స్క్వేర్ తో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా కంటే ముందు చందు దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సాధించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు