Anupama : క్రష్ ఎవరంటే..?

యంగ్ హీరో నికిల్ సిద్ధార్ద్ – అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 18 పేజెస్. దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాని యూత్ ఫుల్ సబ్జెక్టుతో రూపొందించారు. ఈ చిత్రాన్ని జిఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 23వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది చిత్ర బృందం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టార్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. తన క్రష్ ఎవరో రివిల్ చేసింది.

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అంటే తనకు క్రష్ అని తన మనసులోని మాటని బయట పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తనకి ఆర్య సినిమా అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అలాగే సుకుమార్ తనకి నందిని క్యారెక్టర్ ని రాసినందుకు ధన్యవాదాలు తెలిపింది.

- Advertisement -

18 పేజెస్ డిసెంబర్ 23న రిలీజ్ అవుతుందని. అందరూ తప్పకుండా చూడాలని కోరింది అనుపమ. ఇక ఇటీవల అనుపమ హీరోయిన్ గా వచ్చిన కార్తికేయ 2 చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు