Anupama Parameswaran : మసాజ్‌ కావాలంటూ ఆ ఫోటో షేర్‌ చేసిన అనుపమా

Anupama Parameswaran : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ”అ ఆ” సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ సినిమాలో కీలకపాత్రలో నటించి విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకుంది. ఆ సినిమాలో తన నటనకుగాను ఎంతో మంది డైరెక్టర్లు అనుపమ డేట్స్ కోసం క్యూ కట్టేవారు. అలా వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది ఈ బ్యూటీ.

రింగుల జుట్టుతో, క్యూట్ గా, ముద్దు ముద్దు మాటలతో అబ్బాయిలకు డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు వరుస సినిమాలతో తన అభిమానులను అలరిస్తూనే ఉంది. తాను నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడం గమనార్హం.

- Advertisement -

ఈ క్రమంలోనే అనుపమ నటించిన తాజా చిత్రం “టిల్లు స్క్వేర్” ఈ సినిమాలో అనుపమ తన హాట్ నటనతో విపరీతమైన క్రేజ్ ని తెచ్చుకుంది. ఇదిలా ఉండగా… అనుపమకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అనుపమ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. తన హాట్ అండ్ క్యూట్ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటూ తన అందచందాలను ఆరబోస్తూనే ఉంటుంది.

ఈ క్రమంలోనే అనుపమ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. తనకు విపరీతమైన నడుము నొప్పి వస్తుందని తెలియజేస్తూ రోడ్ రోలర్ తో మసాజ్ కావాలని ఓ పోస్ట్ ద్వారా తెలియజేసింది. ఈ ఫోటోలో నగ్నంగా ఉన్న ఒక పురుషుడు…. అతనిపై రోడ్ రోలర్ మసాజ్ చేస్తున్నట్టుగా ఫోటోలో ఉంది. ఈ విధంగానే నా నడుముకు మసాజ్ కావాలంటూ క్యాప్షన్ జత చేసింది. ఇది చూసిన అనుపమ అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు