Anushka: ఆ హీరో వల్లే అనుష్క హీరోయిన్ అయ్యిందా..?

Anushka: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించింది హీరోయిన్ అనుష్క శెట్టి.. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడి హవా కాస్త తగ్గినప్పటికీ అడపా దడపా సినిమాలలో నటిస్తూనే.. ఇతర భాషలలో కూడా నటిస్తోంది. అనుష్క అందానికి, నటనకు ఫిదా అవ్వని కుర్రకారులంటూ ఉండాలని చెప్పవచ్చు. దాదాపుగా టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది.. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనే ఒక బ్రాండ్ ని సైతం ఏర్పడుచుకుంది అనుష్క శెట్టి.. అరుంధతి సినిమా అనుష్క కెరియర్ లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.

యోగ టీచర్గా కెరియర్ మొదలు..

Anushka: Did Anushka become a heroine because of that hero?
Anushka: Did Anushka become a heroine because of that hero?

అయితే అనుష్క హీరోయిన్ కాకముందు ఒక యోగా టీచర్ అని కూడా తెలిసిందే.. మొట్టమొదటిసారిగా అనుష్క సూపర్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సూపర్ సినిమా షూటింగ్ సమయంలో ఈమె పేరును అనుష్కగా మార్చారట. అలా ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. విక్రమార్కుడు, లక్ష్యం, సింగం ,బాహుబలి , మిర్చి , వేదం తదితర చిత్రాలలో కూడా నటించింది. అయితే అనుష్కకు మొదటి అవకాశం ఎలా వచ్చింది అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు.

ఇండస్ట్రీలోకి రావడానికి నాగార్జున కారణం కాదు..

అనుష్కకు ఇండస్ట్రీలోకి ఒక స్టార్ నటుడు ద్వారా అవకాశం లభించిందట. చాలామంది అనుష్కని నాగార్జుననే ఇండస్ట్రీకి పరిచయం చేశారనుకుంటూ ఉంటారు కానీ అనుష్కను ఇండస్ట్రీ కి రికమెండ్ చేసింది మాత్రం మరొక హీరోనట .. ఆయన ఎవరో కాదు సోనూ సూద్.. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా వెల్లడించారు. సూపర్ సినిమా సమయంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వచ్చి సోనూ సూద్ కి కథ చెప్పడం జరిగిందట. హిందీలో బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచిన ధూమ్ సినిమా తరహా లో ఈ కథ ఉంటుందని వెల్లడించారట.

- Advertisement -

సోనూసూద్ వల్లే ఇండస్ట్రీకి అవకాశం..

అలాగే ఈ సినిమాలో సోనూ సూద్ నటిస్తే ఒక కొత్త అమ్మాయి తనకు చెల్లెలుగా, హీరోయిన్ గా కూడా నటించాల్సి ఉందని పూరీ జగన్నాథ్ చెప్పారట. సోనుసూద్ అప్పట్లో జిమ్ సెంటర్ కి వెళుతున్న సమయంలో ఒక అమ్మాయిని చూశాను.. చాలా బాగుంది హీరోయిన్ గా అయితే ట్రై చేద్దాము అన్నట్లుగా పూరి జగన్నాథ్ కు సజెషన్ ఇచ్చారట సోనూ సూద్.. ఆ తర్వాత పూరి జగన్నాథ్ అనుష్కను చూసి కథ చెప్పి ఒప్పించారట. అలా అన్నపూర్ణ స్టూడియోలో అనుష్క సోనూ సూద్ ను చూసి.. మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అడగగా… అప్పుడు పూరి జగన్నాథ్ ఎంటర్ అయ్యి ఆయన వల్లే నువ్వు ఇక్కడ ఉన్నావు అంటూ తెలిపారట. అలా అనుష్క హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి కారణం సోనుసూద్ అని చెప్పవచ్చు. అందుచేతనే అరుంధతి సినిమాలో సోనూ సూద్ విలన్ గా నటించడం జరిగింది. ఇక ప్రస్తుతం అనుష్క మలయాళం లో ఒక సినిమాలో మాత్రమే నటిస్తోంది మరి ప్రాజెక్టుకి సంతకం చేయకపోవడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు