Anushka: ఆ పాత్రలో మరోసారి అనుష్క ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అగ్ర హీరోలు అందరి సరసన నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

అనుష్క తన కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఓరియంటెడ్ సినిమాలలో నటించి తన కెరియర్ ను తన చేతులారా తానే ఫ్లాప్ అయ్యేలా చేసుకుంది. మరీ ముఖ్యంగా వేదం, సైజ్ జీరో వంటి సినిమాలు ఆమెకు భారీ నిరాశను మిగిల్చాయి. వేదం సినిమాలో అనుష్క వేశ్యపాత్రలో నటించి చాలా ట్రోలింగ్ కు గురైంది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. కొన్నాళ్ల గ్యాప్ తీసుకున్న తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

- Advertisement -

ఈ సినిమా కూడా అంత పెద్ద విజయాన్ని అందుకోలేదు. ఇప్పుడు అనుష్క…. క్రిష్ దర్శకత్వంలో మరొక సినిమాలో నటించబోతుందట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం….ఓ కొత్త దర్శకుడి సినిమాలో అనుష్క నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కూడా మరోసారి అనుష్క వేశ్యపాత్రలో కనిపించబోతుందట. మరీ ముఖ్యంగా వేదం సినిమాకు మించిన సీన్స్, బోల్డ్ డైలాగ్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయట. ఈ సినిమా కోసం అనుష్క అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ కొత్త దర్శకుడి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు