Anushka – Virat : విరుష్క దంపతుల వారసుడొచ్చేశాడోచ్… అతని పేరుకు అర్ధమేంటో తెలుసా? 

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులు తమ రెండవ బిడ్డకు తాజాగా వెల్కమ్ చెప్పేశారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలను ఎట్టకేలకు నిజం చేశారు. మరి ఇంతకీ ఈ దంపతులకు పుట్టిన న్యూ బార్న్ బేబీ పేరేంటి ? ఆ పేరుకు అర్థం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

గత కొన్ని నెలలుగా అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ రెండవసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే రూమర్లతో వార్తల్లో నిలుస్తున్నారు. చాలా రోజులుగా అనుష్క బయట ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె నిజంగానే ప్రెగ్నెంట్ అని ఫిక్స్ అయిపోయారు నెటిజెన్లు. అయితే నిన్న రాత్రి వరకు ఈ వార్తలపై వీరిద్దరూ స్పందించలేదు. కొంతకాలం క్రితం దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే ఆ తర్వాత డివిలియర్స్ తన మాటను వెనక్కి తీసుకోవడంతో జనాలు అయోమయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ నుంచి విరాట్ తప్పుకోవడం మరోసారి చర్చకు దారి తీసింది. బీసీసీఐ కుటుంబ కారణాల వల్ల అతను ఈ సిరీస్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించింది. కానీ తనకు పుట్టబోయే బిడ్డ కోసమే విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. మొత్తానికి రూమర్లను నిజం చేస్తూ తాజాగా సెలబ్రిటీ కపుల్ అనుష్క శర్మ విరాట్ కోహ్లీ రెండవసారి తల్లిదండ్రులు అయ్యారు. ఈ బాలీవుడ్ బ్యూటీ నిన్న రాత్రి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనుష్క స్వయంగా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అభిమానులకు శుభవార్త చెప్పారు. అదే పోస్ట్ లో తన కుమారుడి పేరును కూడా వెల్లడించారు.

అనుష్క శర్మ తన పోస్ట్ లో “ఆనందం, ప్రేమతో మా హృదయాలు నిండిపోయాయి. మేం మా అబ్బాయి అకాయ్, వామికా చిన్న సోదరుడిని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాము. ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పడం సంతోషంగా ఉంది. మా జీవితంలోని ఈ అందమైన సమయంలో మీ ప్రార్థనలు, శుభాకాంక్షలు మేము కోరుకుంటున్నాము. దయచేసి మా ప్రైవసీని గౌరవించాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము” అంటూ రాసుకొచ్చింది. దీంతో అభిమానుల నుంచి ఈ జంటకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు అనుష్క రెండవ బిడ్డ పేరుకు అర్థం ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు. వెంటనే గూగుల్ తల్లిని ఆశ్రయించి అకాయ్ అనే పేరుకు అర్థం ఏంటో కనిపెట్టేశారు. అకాయ్ అనేది సంస్కృత పదం కాగా, దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి భౌతిక శక్తికి మించిన వాడు, మరొకటి శివుడికి ఉన్న వేయి నామాలలో ఒకటి. ఇక అకాయ్ అంటే టర్కిష్ లో ప్రకాశించే చంద్రుడు అనే అర్థం వస్తుంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు