Anushka Shetty: క్యాస్టింగ్ కౌచ్ పై అనుష్క సంచలన పోస్ట్..!

Anushka Shetty.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, యాక్షన్ పర్ఫామెన్స్ తో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సొంతం చేసుకున్న అనుష్క శెట్టి, పాన్ ఇండియా చిత్రాలతో కూడా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా బాహుబలి తరువాత వరుస ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఈమెకు మాత్రం అవకాశాలు తలుపుతట్టలేదు. పైగా ఈమె నటించిన సైజ్ జీరో పర్వాలేదు అనిపించిన ఆ తర్వాత నటించిన నిశ్శబ్దం, భాగమతి చిత్రాలు కూడా డిజాస్టర్ గానే నిలిచాయి.

Anushka Shetty: Anushka's sensational post on the casting couch..!
Anushka Shetty: Anushka’s sensational post on the casting couch..!

అనుష్క కెరియర్..

అలా ఇండస్ట్రీకి దూరమైన ఈమె, ఈ మధ్య మళ్లీ రీఎంట్రీ ఇచ్చి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా తర్వాత మరే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరొకవైపు మలయాళంలో అడుగుపెట్టబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మలయాళ సినీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ సమర్పించిన నివేదిక తర్వాత విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కో ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ లు తమ చేదు అనుభవాల గురించి మీడియాతో పంచుకుంటున్నారు.

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉంది..

ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి కూడా క్యాస్టింగ్ కౌచ్ స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇకపోతే జస్టిస్ హేమ కమిటీ నివేదిక తర్వాత స్టార్ హీరోయిన్ సమంత (Samantha)హేమా లాంటి కమీషన్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కోరుతూ ఇటీవల వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో సంచలన పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. దీంతో అందరూ ఈమె వేసిన పోస్ట్ గురించి చర్చించుకుంటున్నారు.

- Advertisement -

సమంత పోస్టుకి సపోర్టుగా అనుష్క శెట్టి..

ఇప్పుడు సమంత (Samantha)కి సపోర్టుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా తన ఇన్స్టా వేదికగా ఒక సంచలన పోస్ట్ పెట్టింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని మహిళలమైన మేము హేమా కమిటీ వేదికను స్వాగతిస్తున్నాము. ఈ మంచి కార్యక్రమానికి మార్గం వేసిన WCCin కేరళను అభినందిస్తున్నాము. తెలుగు సినీ పరిశ్రమలో ఉండే మహిళల కోసం ప్రత్యేకంగా.. 2019లో గ్రూప్ ది వాయిస్ ఆఫ్ ఉమెన్ అనే ఒక గ్రూపును కూడా ఏర్పాటు చేయబడింది. దయచేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆకాంక్షిస్తున్నాము అంటూ అనుష్క శెట్టి కోరింది. ఇక సమంత తర్వాత అనుష్క కూడా ఇలాంటి పోస్ట్లు చేయడంతో అందరూ ఆశ్చర్యం పోతున్నారు. తెలుగులో కూడా ఇలాంటి ఇబ్బందులను ఆడవారు ఎదుర్కొంటున్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే రోజురోజుకు ఈ వివాదం ముదురుతోంది. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఇద్దరు స్టార్ హీరోయిన్లు కమిటీ వేయాలని కోరడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు