Anushka Shetty: అనుష్క శెట్టి ” ఘాటీ ” పై క్రేజీ అప్డేట్..!

Anushka Shetty: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది సీనియర్ హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో అనుష్క శెట్టి ఒకరు. సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అది తక్కువ కాలంలోనే… ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా మారింది ఈ బ్యూటీ.

అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమాలో చిన్న పాత్ర చేసి.. ఆ తర్వాత… ఇండస్ట్రీలో వరుసగా చాన్సులు కొట్టేసింది. ముఖ్యంగా ప్రభాస్ లాంటి బడా హీరోల సరసన చేసి… ఎన్నో మార్పులు కొట్టేసింది ఈ బ్యూటీ. ఇటు అరుంధతి లాంటి లేడి ఓరియెంటెడ్ సినిమాలు చూసి.. తన సత్తా చాటింది. ఇక ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లో మెరిసింది. ప్రస్తుతం… ఘాటికి సినిమా చేస్తోంది అనుష్క.

Anushka
Anushka Shetty

ఈ సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తీస్తున్నారు. ఇందులో అనుష్క రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్… యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా వస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించారట. దాదాపు నెలరోజుల పాటు రామోజీ ఫిలిం సిటీ లో… ఈ షూటింగ్ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు