Anushka Shetty: అనుష్కను ఘోరంగా అవమానించిన డైరెక్టర్.. మరి ఇంత నీచంగా..?

Anushka Shetty.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుని విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న అనుష్క శెట్టి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. యోగ టీచర్గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత ఒక సీరియల్ లో కూడా నటించింది.. కానీ హీరోయిన్ అవ్వాలనే కోరిక ఎక్కువగా ఉండేదట.. అయితే ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు.. నీకు సినిమాల్లో ఎవరు అవకాశం ఇస్తారు అని చెప్పేవారట. దాంతో విసిగిపోయిన అనుష్క.. ఇకపై సినిమాలలో నటించకూడదని ..యోగ టీచర్ గానే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండేది.

Anushka Shetty: The director who insulted Anushka badly.. and so meanly..?
Anushka Shetty: The director who insulted Anushka badly.. and so meanly..?

హీరోయిన్ గా ఎంతో ప్రయత్నం..

అయితే ఒకానొక సమయంలో నువ్వు హీరోయిన్ లా చాలా అందంగా ఉన్నావు.. సినిమాలలో ట్రై చేయవచ్చు కదా అని తన వద్దకు యోగ నేర్చుకోవడానికి వచ్చిన వారు చెప్పేవారట.. వారి మాటలు విని మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరిగింది. అలా ఒక సీరియల్లో అవకాశం వచ్చిన ఈమె.. సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనుకొని.. కన్నడలో టాప్ డైరెక్టర్ ను ఆశ్రయించి సార్ మీ సినిమాలో నాకు చిన్న పాత్ర అయినా ఇవ్వండి అని అడిగిందట..

అనుష్కను దారుణంగా అవమానించిన డైరక్టర్..

అయితే దానితో అనుష్కను చూసిన ఆ డైరెక్టర్ అసలు నువ్వు హీరోయిన్ మెటీరియల్ వే కాదు.. నువ్వు బట్టలు మొత్తం విప్పి చూపించినా నిన్ను ఎవరు చూడరు అంటూ అసహ్యంగా ఘోరంగా కామెంట్లు చేశారట.. అంతేకాదు నువ్వు సినిమాలో హీరోయిన్గా చేయడం కంటే పెళ్లి చేసుకుని చక్కగా పిల్లల్ని కని భర్తతో హాయిగా ఉండమని సలహా కూడా ఇచ్చారట.. కానీ అనుష్క మాత్రం ఆ డైరెక్టర్ మాటలకు నిరాశ పడకుండా ప్రయత్నం చేస్తూనే వచ్చింది. అలా ఒక డైరెక్టర్ ఈమెను చూసి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాబోయే సూపర్ సినిమా కోసం అడిగారట.. అప్పటికే అనుష్క ఒప్పుకోలేదట.. ఎందుకంటే అంతగా విసిగిపోయింది.. దీంతో పూరీ జగన్నాథ్ , నాగార్జున ఆమెకు పూర్తిస్థాయిలో ట్రైనింగ్ ఇచ్చి.. సూపర్ సినిమాలో నటించేలా చేశారు. ఇక ఈ సినిమాలో అద్భుతంగా నటించింది అనుష్క.. తన నటనతో మంచి మార్కులే వేయించుకుంటుంది.

- Advertisement -

స్టార్ హీరోయిన్ గా ఇమేజ్..

ఇకపోతే అనుష్క అరుంధతి సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించిన ఈమె.. బాహుబలి సినిమాలో రాజసం ఉట్టిపడేలా నటించే ఆకట్టుకుంది. అంతేకాదు బిల్లా సినిమాలో గ్లామర్ వొలకబోసిన ఈమె.. వేదం సినిమాలో వేశ్య గా కూడా నటించి ఆకట్టుకుంది. ఇక తర్వాత సైజ్ జీరో సినిమాతో భారీగా బరువు పెరిగిపోయిన ఈమె.. ఆ తర్వాత భాగమతి, నిశ్శబ్దం వంటి సినిమాలు చేసింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేదు.. ఇక బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది.. క్రమంగా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైంది. చివరిగా గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు మరే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు