Anushka: అనుష్క ఇంట పెళ్లి పనులు షురూ ?

Anushka: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సూపర్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాలో అద్భుతంగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఆ సినిమా అనంతరం అనుష్క వెనుతిరిగి చూసుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆగ్ర హీరోయిన్ గా నిలిచింది. కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తన హవాను కొనసాగించింది.

ఇక ఈ బ్యూటీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ దాదాపు 19-20 ఏళ్లకు పైనే అవుతుంది. అనుష్క సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి తన కెరియర్ తానే దెబ్బతినేలా చేస్తుంది. ఇక మరి ముఖ్యంగా వేదం, సైజ్ జీరో వంటి సినిమాలు అనుష్క ఫ్యాన్స్ కు భారీ నిరాశను మిగిల్చాయి. ఈ సినిమాలో అనుష్క నటనను ప్రేక్షకులు ఇష్టపడలేదు. ఇక గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న అనుష్క ఈ మధ్యకాలంలోనే మిస్ శెట్టి…. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

ఇదిలా ఉండగా…. ఈ బ్యూటీ తన కెరీర్ లో ఒక్క కాంట్రవర్సీని ఎదుర్కోలేదు. దానికి గల కారణం అనుష్క నిర్మాతల హీరోయిన్ అని అంటారు. ఇక మరీ ముఖ్యంగా అనుష్క చాలామంది నిర్మాతలతో ఎఫైర్స్ పెట్టుకుంది అంటూ అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇక మరీ ముఖ్యంగా ప్రభాస్ తో పాటు మరికొందరు స్టార్ హీరోలతో కూడా అనుష్క ఎఫైర్ నడిపిందంటూ గట్టిగానే పుకార్లు వచ్చాయి. ఇప్పటివరకు అనుష్క వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది. తాజాగా అనుష్క పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందనే వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

- Advertisement -
Anushka Shetty: The director who insulted Anushka badly.. and so meanly..?
Anushka Shetty

తన కుటుంబసభ్యులు అనుష్క కోసం అబ్బాయిని వెతికే పెట్టారట. ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్ నీ సెలక్ట్‌ చేశారట. అతను అనుష్కకు బాగా సెట్ అవుతాడని…. హ్యాండ్సమ్ గా ఉన్నాడని…. మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని తెలుస్తోంది. ఇక ఆ అబ్బాయితో వివాహానికి అనుష్క ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఇక ఈ వివాహానికి అనుష్క ఒప్పుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ అనుష్క ఇన్ని రోజులకు వివాహానికి సిద్ధమైందని తెలిసి తన అభిమానులు ఎంతో సంబరపడిపోతున్నారు. ఇక ఇందులో ఇంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు