Vijay Sethupathi: ఎవరైనా హీరో అవ్వచ్చు – విజయ్ సేతుపతి

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తను చేస్తున్న జాబు వదిలేసి, సినిమాలు మీద ఆసక్తితో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో నటుడుగా అడుగులు మొదలుపెట్టాడు. అయితే తమిళ్లో విజయ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేశాడు. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన పిజ్జా సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత హీరోగా వరుసగా సినిమాలు చేశాడు విజయ్ సేతుపతి.

ఇక విజయ్ సేతుపతి ప్రస్తుతం కొన్ని సినిమాల్లో విలన్ రోల్ లో కనిపిస్తున్నారు. అలానే హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ విక్రమ్ వంటి సినిమాల్లో విలన్ లా కనిపించి తనదైన విలనిజాన్ని చూపించాడు. ఇక విజయ్ సేతుపతి చేసిన చాలా తమిళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా చూశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు విజయ్ సేతుపతి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఉప్పెన సినిమాలో కనిపించాడు.

Vijay Sethupathi

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం విజయ్ సేతుపతి మహారాజా అనే సినిమాను చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ పాతది అయినా కూడా ఈ కథను చెప్పే స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు హీరో సుహాస్ తో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు విజయ్ సేతుపతి. ఈ ఇంటర్వ్యూలో సుహాస్ మాట్లాడుతూ నేను సినిమా చేసేటప్పుడు హీరో అని చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యావని అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి విజయ్ సేతుపతి స్పందిస్తూ ఎవరైనా హీరో హీరో కావచ్చు అని చెప్పారు. ఎవరి లైఫ్ లో వారి హీరో. అలానే వేరే దర్శకుడు కథను మీ పాత్ర ద్వారా చెప్తున్నాడు కాబట్టి అక్కడ కూడా మీరు హీరో అంటూ చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు