Ap Elections 2024 : అప్పుడు జగన్ – ఇప్పుడు పవన్… ఇండస్ట్రీ వాళ్లు చాలా తెలివైనొళ్లు అండి

Ap Elections 2024 : ఎప్పుడూ చెప్పుకున్నట్టు రాజకీయాలకు సినిమాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు అయితే ఈ బంధం ఫెవికాల్ కంటే బలమైంది. అప్పుడు ఎన్టీ రామారావు నుంచి ఇప్పటి పవన్ కళ్యాణ్ వరకు… ఎంతో మంది సినీ స్టార్స్.. రాజకీయాల్లోకి వచ్చి సినీ ఇండస్ట్రీని రాజకీయలపై వైపునకు తిప్పారు. అంతే కాదు ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు గెలుపును కూడా శాసించారు. తెలుగు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో చూస్తే.. ఏపీలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో… ఆ పార్టీ వైపే సినీ ప్రముఖులు ఉంటున్నారు. ఎన్నికల ముందు కొద్ది మంది ఇతర పార్టీ వైపు ఉన్నా.. ఫలితాల తర్వాత పార్టీ మార్చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో పవన్ పరిస్థితి…

2019లో ఎన్నికల్లో ఇండస్ట్రీలో చోటా నటీనటులే తప్పా.. ఎవరూ పెద్దగా సపొర్ట్ చేయలేదు. జనసేన పార్టీ (JSP) అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగిన ఏపీ ఎన్నికల్లో ఘోరమైన రిజల్ట్ ను చూడాల్సి వచ్చింది. ఎందుకంటే అతను పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాల నుండి పవన్ ఓడిపోయాడు. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.నాగిరెడ్డిపై 16 వేలకు పైగా ఓట్ల తేడాతో పవన్ ఓడిపోయారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన గ్రంధి శ్రీనివాస్‌ 8 వేలకు పైగా ఓట్లతో గెలుపొందగా, ఇక్కడ కూడా పవన్ ఓటమిని చవిచూశారు. తెలుగుదేశం పార్టీకి, వైఎస్సార్‌సీపీకి మధ్య హోరాహోరీ పోరు ఏర్పడితే ఎక్స్‌ఫాక్టర్‌గా ఎదురుచూసిన జేఎస్‌పీకి ఎదురుదెబ్బ తగిలింది. ఫలితంగా అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి మంచి మెజార్టీతో అధికార పగ్గాలు చేపట్టారు. అయితే పవన్ ఓటమికి పరోక్షంగా సినిమా ఇండస్ట్రీ కూడా కారణమైంది. ఎందుకంటే ఒక్కరు కూడా గొంతెత్తి పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయలేదు.

2019లో ఇండస్ట్రీ సపొర్ట్…

2019 ఎన్నికల్లో ఇండస్ట్రీలో ఉండే బడా నటీనటుల నుంచి చిన్న చితక యాక్టర్స్.. రీల్స్ చేసుకునే వారు కూడా జగన్ కి సపొర్ట్ చేశారు. సినీ పెద్దలుగా చెప్పుకునే కొంతమంది ప్రముఖులు 2019 ఎన్నికల్లో వ్యూహాత్మకంగా మౌనం పాటించారు. అటు పవన్ కు సపోర్ట్ చేయలేదు. అలాగని జగన్ తరపున కూడా నిలబడలేదు.

- Advertisement -

Pawan Kalyan turns 48: Rare photos of Power Star | Entertainment Gallery News - The Indian Express

2024లో పవన్ పరిస్థితి…

2024లో 2019తో పోలిస్తే పూర్తిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీ మొత్తం సపొర్ట్ గా నిలబడింది. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని పూర్తిగా మెగా హీరోల సపోర్ట్ పవన్ కళ్యాణ్ కే లభించింది. అంతేకాదు మెగా ఫ్యామిలీ అంటే అభిమానం, టీడీపీనే గెలవాలి అని కోరుకునే చాలామంది సినీ సెలబ్రిటీలు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేశారు. మెగా హీరోలంతా డైరెక్ట్ గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే, మిగతా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తమ మద్దతు తెలిపారు. దీంతో పవన్ ఈసారి మరింత స్ట్రాంగ్ గా మారారు.

2024లో ఇండస్ట్రీ సపొర్ట్…

ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు డైరెక్ట్ గా టీడీపీ బీజేపీ జనసేన కూటమికి సపొర్ట్ చేశారు. కొంత మంది అయితే కూటమికి సపొర్ట్ గా ప్రచారం కూడా చేశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి జబర్దస్త్ యాక్టర్స్, పవన్ కళ్యాణ్ ను అభిమానించే ఇతర నటీనటులు ప్రచారం మొదలు పెట్టేశారు. సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ తమ సపోర్ట్ ను తెలియజేయడమే కాకుండా ప్రచారాల్లో కూడా పాల్గొన్నారు. చిరంజీవి పిలుపుతో దీరక్టర్ హరీష్ శంకర్, రవితేజ, నాని, రాజ్ తరుణ్ వంటి హీరోలు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా ట్వీట్లు చేశారు.

కూటమికి ఇండస్ట్రీ సపొర్ట్ చేయడానికి కారణం…

జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో సినిమా ఇండస్ట్రీ చాలా మార్పులు జరిగాయి. సినిమా పరిశ్రమను హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో చాలా ఇబ్బందులు పెట్టారు.
టికెట్ ప్రైజ్ లు, ఈవెంట్స్ కు పర్మిషన్ ఇవ్వకపోవడం లాంటివి చేయడం వల్ల చాలా సినిమాలు హిట్టయిన కమర్షియల్ గా లాభాలను వెనకేసుకోలేకపోయాయి. అంతేకాకుండా వైఎస్సార్సీపీ పార్టీకి అగైనెస్ట్ గా ఉన్న సెలబ్రిటీలు సినిమాల ప్ర్ రిలీజ్ ఈవెంట్లకు పర్మిషన్లు తీసుకోవాలన్నా, పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేయాలన్నా టికెట్ రేట్లు తగ్గిన నేపథ్యంలో చాలామంది నిర్మాతలకు ఇదో తలనొప్పిగా మారింది. అందుకే సెలబ్రెటీలు జగన్ సర్కార్ పై కోపం తెచ్చుకుని కూటమికి సపొర్ట్ చేశారు. ఫలితంగా ఈసారి కూటమి మెజార్టీ ఓట్లతో విజయభేరి మోగించింది. ఇక అందులో పవన్ కళ్యాణ్ దే కీలకపాత్ర కావడంతో సినిమా స్టార్స్ సంబరాలు మిన్నంటాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు