AR Rahman: ఏ ఆర్ రెహమాన్ బాలీవుడ్ భారీ లైనప్

AR Rahman: ఏ ఆర్ రెహమాన్ భాషతో సంబంధం లేకుండా రెహమాన్ మ్యూజిక్ అలరిస్తూ ఉంటుంది. మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు కంపోజ్ చేసిన సాంగ్స్ లో పల్లవి ఇచ్చిన ఫీల్ చరణం ఇవ్వకపోవచ్చు. చరణం లో ఉన్న ఫీల్ పల్లవిలో ఉండకపోవచ్చు. కానీ రెహమాన్ సంగీతం విషయానికి వస్తే పాట మొదటి నుంచి చివరి వరకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఏ ఆర్ రెహమాన్ కెరియర్ లో ఉన్నాయి. రెహమాన్ పాటల్లో ఉన్నంత పీస్ ఇంకో పాటల్లో ఉండదు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. తన మ్యూజిక్ తో హృదయాన్ని హత్తుకునేలా చేయటం ఏఆర్ రెహమాన్ కు వెన్నతో పెట్టిన విద్య.

ఏ ఆర్ రెహమాన్ తెలుగులో పవన్ కళ్యాణ్ కు కొమరం పులి అనే సినిమాకు సంగీతం అందించారు. ఆ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 16వ సినిమాకు సంగీత అందిస్తున్నాడు. ఈ సినిమా పైన కూడా మంచి అంచనాలు నెలకొన్నా యి. ఆ మధ్యకాలంలో ఏఆర్ రెహమాన్ చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు అంటూ అక్కడక్కడా కథనాలు వినిపించేవి. ఇకపోతే ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ చేతిలో నాలుగు భారీ బాలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నాయి.

AR Rahman

- Advertisement -

ఏఆర్ రెహమాన్ లైనప్

ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ చేస్తున్న లైనప్ లో చావా సినిమా ఉంది. ఇది ఒక హిస్టారికల్ సినిమా అని ఇదివరకు అధికారికంగా ప్రకటించారు. లహోరే 1947 సన్నీ డియోల్ నటిస్తున్న ఈ యాక్షన్ ఫిలిం కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే చిచోరే సేమ్ దర్శకుడు నితీష్ తివారి రామాయణం సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రాముడు పాత్రలో రన్బీర్ కపూర్ కనిపిస్తున్నారు. కన్నడ హీరో యష్ కూడా ఒక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలానే ధనుష్ హీరోగా చేస్తున్న ఒక లవ్ స్టోరీ కి కూడా సంగీతం అందిస్తున్నారు ఏఆర్ రెహమాన్.

అంచనాలన్నీ చరణ్ సినిమాపై

రెహమాన్ బాలీవుడ్ లో చేస్తున్న సినిమాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే, రామ్ చరణ్ సినిమాకు చేయబోయే సినిమా మరొక ఎత్తు. ఎందుకంటే ఆ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసను ఎలా మాట్లాడుతాడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కబడ్డీ బ్యాక్ గ్రౌండ్ లో కూడా జరుగుతుంది అని కథనాలు వినిపిస్తున్నాయి. వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు