Salaar : ఫ్యాన్స్ భయమే నిజం అవుతోందా?

Salaar : డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” ఎట్టకేలకు డిసెంబర్ 22న థియేటర్లలోకి వచ్చేసింది. అలాగే తమ అభిమాన హీరో ప్రభాస్ కు చాలాకాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చింది “సలార్”. కలెక్షన్ల పరంగానూ ఈ మూవీ రికార్డ్ స్థాయి వసూళ్లను రాబడుతూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక్కడి వరకు అభిమానులు సంతోషంగానే ఉన్నారు. కానీ “సలార్” మూవీ ఓ విషయంలో మాత్రం ఫాన్స్ భయాన్ని నిజం చేస్తోంది. అంతేకాకుండా అది కొంతమంది అభిమానులు నిరాశను కలిగించడమే కాకుండా, కలెక్షన్ల పై కూడా ప్రభావం చూపిస్తూ ఉండడం ఆందోళనకరంగా మారింది. ఇంతకీ ప్రభాస్ ఫ్యాన్స్ ను టెన్షన్ పడుతున్న ఆ అంశం ఏమిటి? అనే విషయంలోకి వెళ్తే…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” థియేటర్లలో చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. మొదటి రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 175 కోట్లకు పైగా భారీ వసూళ్లు రాబట్టి 2023 లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ వీకెండ్ తో పాటు “సలార్” కు క్రిస్మస్ హాలిడే కూడా కలిసి వచ్చింది. కాబట్టి సినీ ప్రియులంతా ఈ రెండు రోజుల్లో థియేటర్లకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఇక సోమవారం రోజు ఈ మూవీకి భారీ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా ఉంటే మరోవైపు “సలార్” మూవీతో ప్రభాస్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు కావలసినన్ని థియేటర్లు దొరకక చాలా చోట్ల తక్కువ షోలు పడుతున్నాయి. అయితే థియేటర్లు ఉన్నచోట కూడా ఎంట్రీ లేకపోవడంతో ఎంతోమంది అభిమానులు సినిమాను థియేటర్లలో చూడలేకపోతున్నాం అని నిరాశకు గురవుతున్నారు. అయితే వీళ్ళు థియేటర్లోకి వెళ్లలేక పోవడానికి కారణం టికెట్లు దొరకకపోవడం కాదు, కొంతమంది అభిమానుల వయసు అడ్డంకిగా మారింది.

- Advertisement -

అవును.. “సలార్” మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. సినిమాలో మరీ అభ్యంతరకర శృంగార భరిత సన్నివేశాలు లేకపోయినప్పటికీ, మితిమీరిన వైలెన్స్ ఉందంటూ 18+ వాళ్లు మాత్రమే చూసేలా ఏ సర్టిఫికెట్ ను ఇచ్చారు సెన్సార్ సభ్యులు. ఇక సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను ఎంత అసంతృప్తికి గురి చేసిందో, సినిమాను థియేటర్లలో వీక్షించాలి అని అనుకుంటున్న ఏజ్ 18లోపు టీనేజర్లకు కూడా అంతే అసంతృప్తిని కలిగిస్తోంది.

కొంతమంది టీనేజర్లు సినిమాను చూడడానికి ప్రయత్నించి ఎలాగోలా థియేటర్లలోకి వెళ్ళగలిగినప్పటికీ, థియేటర్ యాజమాన్యం మాత్రం పోలీసులను పిలిపించి మరీ వాళ్లను బయటకు గెంటేయిస్తుంది. ఇక ఇది కేవలం వాళ్ళ అసంతృప్తి మాత్రమే కాదు, చాలామంది సినిమాను మిస్ అవుతుండడంతో అది కలెక్షన్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. సలార్ కలెక్షన్లు తగ్గడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్. ఈ విషయం గురించే ప్రభాస్ అభిమానులు సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది అన్నప్పుడు టెన్షన్ పడ్డారు. అయితే ఇప్పుడు వాళ్లు అనుకున్నట్టుగానే చాలామంది సినిమాను చూడలేకపోవడంతో పాటు, ఎంతో కొంత కలెక్షన్లు కూడా తగ్గుతున్నాయి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు