ARI : ఇక్కడ అందరి కోరికలు తీర్చబడును… సరికొత్త కాన్సెప్ట్ తో..

ARI : టాలీవుడ్ లో ఈ మధ్య పెద్దా చిన్నా అనే తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొడుతున్నాయి. సరికొత్త కాన్సెప్ట్స్ తో వచ్చే చిత్రాలకు ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. అయితే కొన్ని సినిమాలు మంచి కాన్సెప్ట్స్ తో వచ్చినా స్క్రీన్ ప్లే లోపం వల్ల నిరాశపరుస్తున్నాయి. ఇదిలా ఉండగా, లేటెస్ట్ గా ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయ శంకర్ దర్శకత్వంలో ‘అరి’ అనే చిత్రం తెరకెక్కింది. సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చేసిన టీజర్, ట్రైలర్‌ తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేట్టు చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ARI movie coming soon with a new concept

ఆరు పాత్రలు ఆరు విభిన్న కోణాలు..

ఇక అరి సినిమాలో హీరో మనుషుల్లోని కోరికలు తీరుస్తానంటూ ఓ టీమ్ నడుపుతున్నాడని ట్రైలర్ లో చెప్పడం జరిగింది. మనిషిలోని అరిష‌డ్వ‌ర్గాలు అయిన కామ‌.. క్రోధ‌.. లోభ‌.. మొహ‌.. మ‌ద‌.. మాత్స‌ర్యాల చుట్టూ తిరిగే కథతో ‘అరి’ చిత్రాన్ని రూపొందించారు. ఇక తాజాగా హీరో వద్దకు వచ్చే ఈ ఆరు కోణాలున్న వివిధ రకాల వ్యక్తులను చూపిస్తూ లేటెస్ట్ గా ఓ ప్రోమో రిలీజ్ చేసారు మేకర్స్. అందులో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కోరిక ఉన్నట్టు చూపించారు. ఇక రివీల్ చేసిన పాత్రల్లో సాయి కుమార్, అనసూయ, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురభి ప్రభావతి పాత్రలను చూపించారు. వాళ్ళు తమ తమ కోరికలను తీర్చుకున్నారా? సినిమాలో హీరో అసలెందుకు ఇలాంటి పని చేస్తుంటాడు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

- Advertisement -

థియేటర్లలో వస్తుందా? లేదా ఓటిటియా?

ఇక ‘అరి’ (ARI) సినిమా కి ఇక్కడ అన్ని కోరికలు తీర్చబడును అనే కాప్షన్ పెట్టగా, కృష్ణ తత్వాన్ని కొత్త కోణంలో చూపిస్తూ.. ‘మనిషి ఎలా బతకకూడదు’ అనే అంశాన్ని ఆసక్తికరంగా చూపిస్తున్నట్టు మేకర్స్ ఓ సందర్బంలో చెప్పడం జరిగింది. ఇక ప్రధాన తారాగణంతో పాటు ఈ సినిమాలో సుమన్, ఆమని, చమ్మక్ చంద్ర, శ్రీనివాస రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో ‘అరి’ చిత్రాన్ని శేషు మారంరెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డిలు నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అయితే ఈ సినిమా థియేటర్లలో వస్తుందా లేక ఓటిటి లో వస్తుందా అన్న విషయంపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం ‘అరి’ చిత్రానికి నెట్ ఫ్లిక్స్‌ నుంచి 10 కోట్ల భారీ డీల్ వచ్చిందని, అందుకే థియేటర్ రిలీజ్ చేయడం పై ఆలోచనలో పడ్డారని టాక్. మరి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు