Ariyana Glory : నా కల నెరవేరుతుందంటున్న బిగ్ బాస్ బ్యూటీ..

Ariyana Glory : బుల్లితెరపై బిగ్ బాస్ తో పాపులర్ అయిన ముద్దుగుమ్మ ‘అరియనా’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ షో లోకి రాక ముందు జనాలకి ఈమె గురించి పెద్దగా తెలీదు. కానీ బిగ్ బాస్ 4 లో అడుగుపెట్టిన ఈ అమ్మాయి తన ఆట తీరుతో బుల్లితెర ప్రేక్షకులని మెప్పించింది. సన్నగా స్లిమ్ గా ఉండే పొట్టి పిల్ల సోషల్ మీడియా లో మంచి క్రేజ్ ని సంపాదించింది. ఇక అరియానా ప్రస్తుతం బుల్లితెర, వెండితెర అంటూ అన్ని చోట్లా బాగానే సందడి చేస్తోంది. అయితే అరియానాకి కావాల్సినంత బ్రేక్, రావాల్సినంత సక్సెస్ ఇంకా రావడం లేదు. అసలు బిగ్ బాస్ షోతోనే అరియానాకు బాగా క్రేజ్ వచ్చిందని అందరికీ తెలిసిందే. ఇక ఆ తరువాత రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి ట్రోలింగ్‌ బారిన పడింది. అప్పుడు కాస్త విమర్శలూ అందుకుని వచ్చే ఆఫర్లు పోగొట్టుకుంది. ఇక ప్రస్తుతం సినిమాల్లో చిన్నా చితకా రోల్స్ చేస్తూ కనిపిస్తోంది. అప్పుడప్పుడూ టివి షోలలో కనిపిస్తూ ఉంది. ఇక ఈ మధ్యే రీసెంట్ గా అల్లరి నరేష్ నటించిన “ఆ ఒక్కటీ అడక్కు” అనే మూవీతో అందరినీ పలకరించింది. ఇక అరియానాకు ఇలా సైడ్ రోల్స్ వస్తూనే ఉన్నాయి. కానీ ఈ అమ్మడు సక్సెస్ మాత్రం రావడం లేదు.

Ariana Glory post that their dream of owning a house will come true

కల నెరవేరుతుందని అరియనా ట్వీట్..

ఇక అరియానా గ్లోరీ (Ariyana Glory) బుల్లితెరపై అప్పుడప్పుడు ఈవెంట్లు, షోలు అంటూ సందడి చేస్తుంటుంది. అలాగే సోషల్ మీడియాలో అయితే అభిమానుల్ని ఆకట్టుకునేందుకు, ఫాలోయింగ్ పెంచుకునేందుకు బోల్డ్ ఫోటో షూట్లు చేసేస్తూ ఉంటుంది. ఆ ఫోటోషూట్లు ఎంత వైరల్ అవుతాయో తెలిసిందే. ఇక తాజాగా అరియానా తన చెల్లితో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అరియానా సిస్టర్ నయని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. బిగ్ బాస్ స్టేజ్ మీద అరియానా గురించి నయని మాట్లాడిన మాటలతో బాగానే ఫేమస్ అయింది. ఇక అరియనా పెట్టిన తాజా పోస్ట్ లో తమ కల నెరవేరుతుందని పోస్ట్ చేసారు. ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ ఇప్పుడు తమ సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. డ్రీమ్ హౌజ్ రెడీ కాబోతోందని చెప్పేశారు. తమ కొత్త ఇంటి పనులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి తమ సొంతింటి కల నెరవేరుతుందని అరియానా తమ గుడ్ న్యూస్‌ను అభిమానులతో షేర్ చేసుకుంది.

- Advertisement -

కంగ్రాట్స్ చెబుతున్న బిగ్ బాస్ హౌస్ మేట్స్..

ఇక అరియానా గ్లోరీ వేసిన ఈ పోస్ట్ పై ప్రముఖ బుల్లితెర సెలెబ్రిటీలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు స్పందిస్తూ కంగ్రాట్స్ చెబుతున్నారు. బిగ్ బాస్ లో తనతో పాటు కంటెస్టెంట్స్ గా పాల్గిన్న యాంకర్ లాస్య, రిపోర్టర్ దేవీ నాగవల్లి, బుల్లితెర నటి అన్షు, నటి రాజేశ్వరి ప్రసాద్ ఇలా చాలా మంది అరియానా పోస్ట్ మీద స్పందిస్తూ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక త్వరలోనే గృహ ప్రవేశ వేడుకల్ని కూడా నిర్వహించేలా ఉన్నారని తెలుస్తుంది. ఇక అరియనా గ్లొరి తన టివి షోలలో బిజీగా ఉంటూనే ఎప్పటికప్పుడు ఫోటోషూట్లలో సందడి చేస్తూ బిజీగా ఉంది. ఇక అందరిలా కేవలం ఫోటోషూట్లు చేయకుండా, పలు బ్రాండ్ కంపెనీలకి ప్రమోట్ చేస్తూ సంపాదిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు