Ariyana Glory : ప్రకృతిలో పరవశిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ… స్విమ్ సూట్ లో అందాల రచ్చ…

Ariyana Glory : బుల్లితెరపై బిగ్ బాస్ తో పాపులర్ అయిన ముద్దుగుమ్మ ‘అరియనా’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ షో లోకి రాక ముందు జనాలకి ఈమె గురించి పెద్దగా తెలీదు. కానీ బిగ్ బాస్ 4 లో అడుగుపెట్టిన ఈ అమ్మాయి తన ఆట తీరుతో బుల్లితెర ప్రేక్షకులని మెప్పించింది. సన్నగా స్లిమ్ గా ఉండే పొట్టి పిల్ల సోషల్ మీడియా లో మంచి క్రేజ్ ని సంపాదించింది. ఇక అరియానా ప్రస్తుతం బుల్లితెర, వెండితెర అంటూ అన్ని చోట్లా బాగానే సందడి చేస్తోంది. అయితే అరియానాకి కావాల్సినంత బ్రేక్, రావాల్సినంత సక్సెస్ ఇంకా రావడం లేదు. అసలు బిగ్ బాస్ షోతోనే అరియానాకు బాగా క్రేజ్ వచ్చిందని అందరికీ తెలిసిందే. ఇక ఆ తరువాత రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి ట్రోలింగ్‌ బారిన పడింది. అప్పుడు కాస్త విమర్శలూ అందుకుని వచ్చే ఆఫర్లు పోగొట్టుకుంది. ఇక ప్రస్తుతం సినిమాల్లో చిన్నా చితకా రోల్స్ చేస్తూ కనిపిస్తోంది. అప్పుడప్పుడూ టివి షోలలో కనిపిస్తూ ఉంది. ఇక ఈ మధ్యే రీసెంట్ గా అల్లరి నరేష్ నటించిన “ఆ ఒక్కటీ అడక్కు” అనే మూవీతో అందరినీ పలకరించింది. ఇదిలా ఉండగా తాజాగా అరియనా నెట్టింట స్విమ్ సూట్ లో చేసిన పోస్ట్ సెగలు పుట్టిస్తుంది.

Ariyana Glory bold photos wiral on instagram

ప్రకృతిని పరవశిస్తూ.. స్విమ్ సూట్ లో అందాల రచ్చ..

ఇక అరియానా సోషల్ మీడియాలో కూడా ఎంత యాక్టీవ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు ఫోటోషూట్లు చేస్తూ తన గ్లామర్ షో తో రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా అరియానా గ్లోరీ కేరళలోని వాయనాడ్‌ లో ఓ సుందరమైన చోట తన వెకేషన్ ని గడుపుతుంది. ఇక అక్కడ ప్రకృతి ఒడిలో పరవశిస్తూనే స్విమ్ సూట్ లో ఈత కొడుతూ యువతని రెచ్చగొడుతుంది. ప్రత్యేకించి సిజ్లింగ్ ఫోటోలో, అరియానా ఎరుపు రంగు బ్రాలెట్ మరియు నల్లని షార్ట్‌లు ధరించి, కూల్ గా స్విమ్మింగ్ పూల్‌లో మునిగి కనిపిస్తుంది. ఇక ఆల్మోస్ట్ బికినీ ఓ ఉన్న అరియానా పూర్తి గా గ్లామర్ షో ఇరగదీసిందని చెప్పాలి. అరియానా అక్కడి పచ్చటి అడవి లాంటి చోటులో విహారయాత్రకు వెళ్లి చక్కని అనుభూతిని పొందుతుంది. అలాగే ఫోటోషూట్లు నెట్టింట పెట్టి కుర్రకారుకు మతిపోయేలా చేస్తుంది. ఇక బికినీ షోలు అరియనా కు కొత్తేమి కాదు, ఇలాంటివి ఎన్నో చేసింది.

- Advertisement -

ఫోటోషూట్లలో.. సినిమాల్లో బిజీ..

ఇక అరియనా (Ariyana Glory) సోషల్ ఇన్ఫ్లుయెన్సుర్ గా కెరీర్ స్టార్ట్ చేసినా, బిగ్ బాస్ లోకి వచ్చాకే సక్సెస్ అయింది. ఆ తరవాత తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించింది అరియనా. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. కానీ హీరోయిన్ గా మాత్రం ఛాన్సులు రావట్లేదు. ఇదిలా ఉండగా అరియనా సినిమాల ద్వారా కంటే ఫోటోషూట్ల ద్వారా ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇంస్టాగ్రామ్ లో అరియనా కి ఏకంగా 1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇక అరియనా ప్రస్తుతం ఓ రెండు సినిమాల్లో నటిస్తూ ఉండగా, నెట్టింట దేనిదారి దానిదే అన్నట్టు బోల్డ్ ఫోటోషూట్లు చేస్తూనే ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు