Arjun Sarja: అల్లుడికి ఎంత కట్నం ఇచ్చారో తెలుసా..?

Arjun Sarja.. కన్నడ స్టార్ హీరో అర్జున్ సర్జా అటు కోలీవుడ్, శాండిల్ వుడ్ ఇటు టాలీవుడ్ లో కూడా భారీ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు స్టార్ హీరోల సినిమాలలో కీలకపాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నారు. అంతేకాదు విలన్ గా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని చిత్రాలకి దర్శకత్వం కూడా వహించారు అర్జున్ సర్జ.. ఇక ఇది ఇలా ఉండగా సినిమాల పరంగా బిజీగా ఉన్నా.. వ్యక్తిగత విషయం పట్ల ఎప్పటికప్పుడు తన బాధ్యతలను నెరవేరుస్తూనే ఉంటారు.. ఈ క్రమంలోనే తమ పెద్దమ్మాయి ఐశ్వర్య అర్జున్ కి వివాహం జరిపించిన విషయం తెలిసిందే.

ఉమాపతి తో ఘనంగా పెళ్ళి..

Arjun Sarja: Do you know how much dowry was given to son-in-law?
Arjun Sarja: Do you know how much dowry was given to son-in-law?

ప్రముఖ తమిళ్ కమెడియన్ తంబి రామయ్య కొడుకు ఉమాపతితో గ్రాండ్ గా ఐశ్వర్య అర్జున్ వివాహం జరిగింది. అయితే కూతురు మీద ఉన్న మితిమీరిన ప్రేమతో అర్జున్ కట్నం కింద భారీగా సమర్పించుకున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ నేపథ్యంలోనే అర్జున్ తన అల్లుడికి కట్నంగా ఎంత ఇచ్చారు? ఏమి ఇచ్చారు ? అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

కట్నం కింద ఆస్తిలో సగభాగం..

అసలు విషయంలోకెళితే అర్జున్ హోస్ట్ గా వ్యవహరించిన ఒక రియాల్టీ షోలో ఐశ్వర్య కూడా పాల్గొనింది. అందులో నటించిన మరో కంటెస్టెంట్ ఉమాపతితో ప్రేమలో పడి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.. ఇకపోతే అర్జున్ తన కూతురి పెళ్లికి కట్నం కింద రూ.130 కోట్లకు పైగా ఇచ్చినట్లు సమాచారం.. విలాసవంతమైన బంగ్లాను కూడా బహుమతిగా ఇచ్చారట..పైగా చెన్నైలో అర్జున్ కి చాలా స్థలాలు ఉన్నాయి.. ఇక వాస్తవానికి అర్జున్ కి ఇద్దరూ కూతుర్లే.. కొడుకులు లేరు కాబట్టి.. అర్జున్ ఆస్తి రెండు భాగాలుగా ఇద్దరు కూతుర్లకు చెందుతుంది.. ఇక ఈ నేపథ్యంలోనే తన ఆస్తిలో సగభాగం ఐశ్వర్య కి కట్నంగా ఇచ్చాడు అని తెలుస్తోంది. ఏది ఏమైనా అర్జున్ తన పెద్ద కూతురికి ఇచ్చిన కట్నం గురించి అసలు వివరాలు బయటకు తెలియలేదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

పెళ్ళి వేడుకలకు హాజరైన ముఖ్య అతిథి..

అర్జున్ చివరిగా లియో సినిమాలో నటించి.. ఇటీవలే తన కూతురు పెళ్లి జరిపించి మళ్లీ వార్తల్లో నిలిచారు.. జూన్ 10వ తేదీన ఐశ్వర్య అర్జున్ – ఉమాపతి ల పెళ్లి జరిగింది. చెన్నైలో ఉన్న అంజన సుత శ్రీ యోగాంజనేయ స్వామి మందిరంలో పెళ్లి వేడుక జరిగింది.. ఇక ఇక్కడ విశేషమేమిటంటే ఈ గుడిని స్వయంగా అర్జున్ నిర్మించారు.. హల్దీ వేడుకతో జూన్ 7న పెళ్లి వేడుకలు మొదలయ్యాయి ..జూన్ 8న సంగీత్, జూన్ 10న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఐశ్వర్య – ఉమాపతిల వివాహం జరిగింది. ఈ వివాహానికి పలువురు కుటుంబ సభ్యులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఇకపోతే పెళ్లి కంటే గ్రాండ్గా రిసెప్షన్ జరిగింది.. జూన్ 14న ఐశ్వర్య ఉమాపతిలో వివాహ రిసెప్షన్ జరగగా.. ఈ కార్యక్రమానికి రజనీకాంత్ తో పాటు పలువురు స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు