Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ యాంకర్ శ్యామల కు అదిరిపోయే కౌంటర్ వేసిన ఆర్టిస్ట్ సమీర్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కేవలం ఇది సినిమాల వలన వచ్చింది అని అనుకుంటే పొరపాటే. ఒకవేళ ఈ క్రేజ్ సినిమాల వలన వచ్చింది అని అనుకుంటే పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు ఫెయిలవుతున్న కొద్ది క్రేజ్ తగ్గిపోవాలి. ఎందుకంటే పవన్ కెరియర్ లో దాదాపు ఒక పదేళ్లపాటు హిట్ సినిమా కూడా చేయలేదు. అంతకు మించిన వ్యక్తిత్వం ఏదో పవన్ కళ్యాణ్ లో చాలామంది ఇష్టపడ్డారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో ఎటువంటి పదవులు లేక ముందే చాలామందిని ఆదరించారు పవన్ కళ్యాణ్. ఎంతోమందికి తన వంతు సాయాన్ని కూడా చేశారు. ఒక సందర్భంలో పవర్ స్టార్ గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ తాను చేసిన ప్రతి సాయాన్ని ఒక ఆడియో వేడుకలో వివరిస్తూ వచ్చారు. ఎక్కడ ఏ విషయం జరిగిన చాలా త్వరగా పవన్ కళ్యాణ్ వాళ్ల గురించి తెలుసుకొని మరి స్పందిస్తారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2019లో రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా చాలామంది టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి కూడా చాలామంది మాట్లాడారు. అయితే 2024లో పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లో చాలా కీలకపాత్రను పోషించారు. ఈ ఎలక్షన్ టైం లో కూడా చాలామంది పవన్ కళ్యాణ్ విమర్శించారు అందులో బుల్లితెర యాంకర్ శ్యామల కూడా ఒకరు.

- Advertisement -

 anchor Shyamala

రాజకీయాలంటే ప్రజాసేవ అని పవన్ కళ్యాణ్ ఎవరికి సాయం చేసినట్లు నేనైతే చూడలేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే దీనిపై రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నటుడు సమీర్ స్పందించాడు. ఒక సో కాల్డ్ యాంకర్ తను నాకు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ సాయం చేసినట్లు చూడలేదు అంటూ చెప్పింది. కానీ నేను కళ్ళారా చూసిన ఒక విషయాన్ని మీతో చెప్తున్నాను. ఆయన ఒక న్యూస్ పేపర్లో ఒక విషయం చదివి ఎక్కడో విజయనగరంలో ఉన్న ఒక ఫ్యామిలీకి తన మేనేజర్ సహాయంతో సహా అందించారు అది పవన్ కళ్యాణ్ అంటే అంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు