Pawan Kalyan – Allu Arjun : పుష్ప కి చెక్ పెట్టబోతున్న పవన్… అధికారాన్ని గట్టిగా వాడుతున్నాడుగా..

Pawan Kalyan – Allu Arjun : ఆంధ్ర ప్రదేశ్ లో రెండు వారాల కింద ఎన్నికల ఫలితాలు విడుదలై కొత్త ప్రభుత్వంగా టిడిపి ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇక ఆ ఎన్నికల్లో టిడిపికి జనసేన తరపున పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చి ప్రచారం చేయగా, తాను కూడా ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజార్టీ తో గెలవడమే కాకుండా, తనతో పాటు జనసేన నుండి పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించుకోవడం విశేషం. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కి తాజాగా ప్రభుత్వం తరపున “డిప్యూటీ సీఎం” అయిన విషయం తెలిసిందే. గ్రామీణాభివృద్ధి, పంచాయిత్ రాజ్ తో పాటు, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ కి సంబంధించిన డిపార్ట్మెంట్ లకు సంబంధించిన బాధ్యతలను పవన్ కళ్యాణ్ కి అప్పగించడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ పదవి చేపట్టిన తొలిరోజు నుండే ఆ బాధ్యతలని స్వీకరించి, పలు విభాగాలపై ఫోకస్ పెట్టాడు.

As Deputy CM, Pawan Kalyan focused on Real Pushparaj

పుష్పరాజ్ కు చెక్ పెడుతున్న పవన్ కళ్యాణ్…

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా అటవీ శాఖకి సంబంధించిన మంత్రి కూడా అయ్యారన్న విషయం తెలిసిందే. అందువల్ల అటవీ శాఖకి సంబంధించి అక్కడ నిజమైన పుష్పరాజ్ లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కఠిన చర్యలు తీసుకోబోతున్నాడట. అటవీ & పర్యావరణ శాఖపై మరింత దృష్టి సారించాలని మరియు నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. ఇక సినిమాల్లో రీల్ పుష్పగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్ తో నిజజీవితంలో పుష్పరాజ్‌ లు ఎంతో మంది అడవుల్లో ఉంటారు. అలాంటి పుష్ప రాజ్ ల నుండి జాగ్రత్తగా చూసుకుంటాడని మరియు అడవులను నరికివేయకుండా జైలుకు వెళ్లకుండా చూసుకోవాలని పవన్ కళ్యాణ్ స్ట్రిక్ట్ ఆర్డర్లు చేసాడని సమాచారం. ఇదిలా ఉండగా ఈ విషయంపై నెట్టింట మాత్రం వేరే విధంగా స్పందన వినిపిస్తుంది.

- Advertisement -

డిప్యూటీ సీఎం ఫోకస్ పుష్పరాజ్ పైనే పెట్టాడా?

ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్ప రాజ్ పై (Pawan Kalyan – Allu Arjun) ఫోకస్ పెట్టాడా అని అనిపిస్తుంది. అదేంటంటే.. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అడవులపై గట్టి ఫోకస్ చేస్తున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్‌కి చెక్ పెడుతున్నాడు. అయితే దీని వల్ల రీల్ పుష్ప ( పుష్ప ది రూల్ మూవీ) కి ఏం కాదు కానీ, పుష్ప సినిమా చూసి రెచ్చిపోతున్న నిజమైన పుష్ప రాజ్ లకు పవన్ కళ్యాణ్ చెక్ పెడుతున్నాడని చెప్పొచ్చు. అయితే ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రీల్ పుష్ప రాజ్ కి కూడా చెక్ పెట్టాలని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో రీల్ పుష్పరాజ్ జనసేనానికి కాకుండా వైసిపి లో తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేసాడుగా? దాన్ని హైలెట్ చేస్తూ పుష్పరాజ్ పైనా ఫోకస్ చేయాలనీ పీకే ఫ్యాన్స్ నెట్టింట ఈ టాపిక్ వైరల్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు