AshikaRanganath : సూసేకి పాటకు స్టెప్పేస్తే.. లేట్ చేసినా కిక్కెక్కించింది!

AshikaRanganath : టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరు ఆషికా రంగనాథ్. కన్నడ నేల నుండి వచ్చిన ఈ బ్యూటీ తెలుగులో అమిగోస్ తో ఎంట్రీ ఇవ్వగా లాస్ట్ ఇయర్ నా సామిరంగా తో పాపులర్ అయింది. ఆ సినిమాలో గ్లామర్ తో పాటు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి టాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అయితే వరుస సినిమాల్లో బిజీ అవుతుంది అనుకునే పెద్దగా సినిమాలు చేయకుండా వచ్చిన ఆఫర్లను హోల్డ్ లో పెడుతుందని అంటున్నారు నెటిజన్లు. అయితే పెద్ద సినిమాలపైనే ఈ భామ ఫోకస్ ఉందని అంటున్నారు నెటిజన్లు. ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర లో కీలక పాత్రలో నటిస్తుంది. కానీ ఆఫర్ల కోసం మాత్రం ఎదురుచూస్తూనే ఉంది. అలాగే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ జనాలని ఆక్ట్రాక్ట్ చేస్తుంది.ఇదిలా ఉండగా ఆషికా చేసిన తాజా పోస్ట్ ఇంస్టా లో వైరల్ అవుతుంది.

AshikaRanganath danced to Pushpa2 Sooseki song

సూసేకి పాటకు ఆషికా స్టెప్పులు…

ఇదిలా ఉండగా రీసెంట్ గా పుష్ప ది రూల్ నుండి సూసేకి పేరుతో ఓ డ్యూయెట్ సాంగ్ రిలీజ్ అయిందన్న విషయం తెలిసిందే. రష్మికా అల్లు అర్జున్ మధ్యలో రొమాంటిక్ సాంగ్ గా వచ్చిన ఆ లిరికల్ సాంగ్ నెట్టింట సెన్సేషన్ అయింది. ఇప్పుడు ఆ పాటకు ఆషిక రంగనాథ్ ఇంస్టాగ్రామ్ లో స్టెప్పులేసింది. ఈ పాట‌కు ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఇంస్టాగ్రామ్ లో స్టెప్పులేసి వైరల్ చేయగా, తాజాగా ఈ జాబితాలో అందాల సొగసర ఆషికా రంగ‌నాథ్ చేరింది. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ… ‘సూసేకి’ పాట‌కి స్టెప్పులు వేసే పార్టీకి తాను కొంచెం లేటుగా వ‌చ్చానంటూ చెప్తూ కామెంట్స్ చేసింది. ఇక సిల్వర్ కలర్ అనార్కలీకి టైపు డ్రెస్ లో ఈ పాట‌కు అదిరిపోయే స్టెప్పులు వేసింది ఆషిక.

- Advertisement -

ఫాలోవర్లని పెంచుకుంటున్న ఆషిక..

ఇక ఆషికా (AshikaRanganath) ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో కొత్త పోస్ట్ లు, ఇలా రీల్స్ లు పెడుతూ వైరల్ గా మారుతుంది. హాట్ ఫోజులతో ఘాటు పోస్ట్ లు పెడుతూ తన ఫాలోవర్లని పెంచుకుంటుంది. అలాగే ఇలా రీల్స్ తో కూడా వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం ఆషికా రంగనాథ్ కి ఇంస్టాగ్రామ్ లో 2 మిల్లియన్లకి పైగా ఫాలోవర్లు ఉండగా, సినిమాలకంటే యూట్యూబ్ లో తన టాలెంట్ తోనే ఇంత ఫాలోవర్లని పెంచుకుందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం కన్నడ లో తెలుగులో చెరో సినిమా చేస్తున్న ఆషికా నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై ఆసక్తి నెలకొని ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు