Ashish Reddy: మా సినిమా తో అన్ని స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి

తెలుగు సినిమా సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో రిలీజ్ అయిన ఎన్నో సినిమాలు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలు కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అని చెప్పొచ్చు. అయితే ముందు ముందు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. కానీ ప్రతిసారి ఒక బ్యాడ్ పేజ్ నడిచినట్లు ఇప్పుడు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక బ్యాడ్ పేజ్ నడుస్తుందని చెప్పొచ్చు. థియేటర్ క్లోజ్ అవ్వడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పది రోజులు పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ అవ్వబోతున్నట్లు వార్తలు వినిపించాయి. దీని కారణం సరైన సినిమాలేవి రిలీజ్ కాకపోవడమే.

Ashish Reddy: All screens will open with our film
Ashish Reddy: All screens will open with our film

టిల్లు స్క్వేర్ తరువాత సరైన హిట్ సినిమా లేదు
రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలలో టిల్లు స్క్వేర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టిల్లు సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్లను రాబట్టింది. 100 కోట్లు మార్కెట్ ను దాటేసింది. దీనితో టిల్లు క్యూబ్ సినిమాను కూడా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు సరైన హిట్ సినిమా అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో పడలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది.

విశ్వక్ సేన్ లాంటి వ్యాఖ్యలు
ఇకపోతే ఆశిష్ నటిస్తున్న లవ్ మీ సినిమా ట్రైలర్ను రీసెంట్గా రిలీజ్ చేశారు. ఈ సినిమా మే 25న రిలీజ్ కానుంది. అయితే ఈ ట్రైలర్ ఈవెంట్లో ఆశిష్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా మే 25న రిలీజ్ అవుతుందని నేను నా ఫ్రెండ్స్ కు చెప్పినప్పుడు. వాళ్లు పది రోజులు పాటు థియేటర్లు బంద్ అంటూ చెప్పారు. ఇల్లు స్క్వేర్ తర్వాత ఇండస్ట్రీ డల్ అయిపోయిందని చెబుతున్నారు మా సినిమాతో మూసుకున్న థియేటర్లన్నీ కూడా ఓపెన్ అవుతాయంటూ చెప్పుకొచ్చాడు. అయితే గతంలో విశ్వక్సేను కూడా ఇదే విధంగా వ్యాఖ్యలు చేశాడు. ఇకపోతే ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. మే 25న ఆశిష్ నమ్మకం నిజమవుతుందో లేదో తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు