Ashwini Dutt: ఆయన లేకుంటే కల్కి మూవీనే లేదా.. అశ్వినీ దత్ షాకింగ్ కామెంట్స్..!

Ashwini Dutt.. రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం కల్కి 2898AD. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పైన గత నెల 27వ తేదీన విడుదల చేసి భారీ విజయాన్ని అందుకున్నారు.. దాదాపుగా ఈ సినిమా ఇప్పటికే రూ.1000 కోట్ల క్లబ్ లోకి చేరినట్లు తెలుస్తోంది. సుమారుగా రూ .600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇండియాలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా కల్కి సినిమా నిలిచింది. ఇందులో కీలకమైన పాత్రలో దీపికా పదుకొనే అద్భుతంగా నటించింది.. ముఖ్యంగా ఈమె వల్లే సినిమా నిలబడిందని.. ఈమె చుట్టూనే సినిమా తిరిగిందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇటీవలే తెలియజేశారు..

Ashwini Dutt: Without him there would be no Kalki movie.. Ashwini Dutt's shocking comments..!
Ashwini Dutt: Without him there would be no Kalki movie.. Ashwini Dutt’s shocking comments..!

కల్కి కోసం అంత బడ్జెట్ పెట్టడానికి కారణం..

ఇంతటి భారీ బడ్జెట్ చిత్రానికి నాగ్ అశ్విన్ పూర్తిగా న్యాయం చేసి ఒక అద్భుతమైన ఔట్ పుట్ ని ఇవ్వడం జరిగింది. నిర్మాతలు ఇప్పటికే భారీ లాభాలను కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్వనీ దత్ కు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.. ముఖ్యంగా అందులో ఇంత భారీ బడ్జెట్.. సినిమాకి పెట్టడం పై ప్రశ్న ఎదురవ్వగా.. ఈ విషయం పైన అశ్వినీ దత్ క్లారిటీ ఇచ్చారు.. ఈ సినిమా మొత్తం మేము ప్రభాస్ ని నమ్ముకొని ఇంత బడ్జెట్ పెట్టామంటూ తెలియజేశారు.

ప్రభాస్ ను నమ్మి బడ్జెట్ పెట్టాం..

కల్కి 2898AD సినిమా గురించి మాట్లాడుతూ.. కేవలం మేము ప్రభాస్ ని నమ్ముకొని ఈ చిత్రాన్ని తీయాలనుకున్నాము.. అందుకే అంతటి బడ్జెట్ తో తెరకెక్కించామంటూ అశ్వినీ దత్ తెలియజేశారు.. వైజయంతి మూవీస్ బ్యానర్ మొదలుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఈయన ఇలా మాట్లాడడం జరిగింది.. కల్కి సినిమా మొత్తం ప్రభాస్ ముందు ఉండి మరి నడిపిస్తారనుకున్నాము.. అన్నట్టుగానే జరిగింది.. అంతేకాకుండా రిజల్ట్ కూడా అందుకు అనుగుణంగానే వచ్చింది అంటూ తెలియజేశారు అశ్వినీ దత్.. మొదటిసారి రూ.1000 కోట్ల క్లబ్లో వైజయంతి మూవీస్ అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేశారు.

- Advertisement -

ఓటీటీ పై కూడా క్లారిటీ..

అంతేకాకుండా కల్కి సినిమా కోసం దాదాపుగా చిత్ర బృందం మొత్తం మూడేళ్లు చాలా కష్టంగా పనిచేసింది అంటూ తెలిపారు అశ్వినీ దత్.. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా కల్కి సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది.. అలాగే నార్త్ ఇండియాలో కూడా అంచనాలకు మించి మరీ కలెక్షన్స్ రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది అంటూ తెలిపారు. అంతేకాకుండా కల్కి సినిమాకి మహాభారతం సినిమాకి లింకు పెట్టడం వల్లే ఈ సినిమాకి ఇంత హైప్ ఏర్పడిందని కూడా తెలియజేశారు. కల్కి సినిమా ఓటీటి విడుదల పైన కూడా నిర్మాత అశ్వినీ దత్ మాట్లాడడం జరిగింది.

ఓటీటీ హక్కులను కొన్న అమెజాన్ , నెట్ ఫ్లిక్స్..

కల్కి సినిమా థియేటర్లో లాంగ్ రన్ టైం ఉండడం ఖచ్చితమని భావించాము.. అందుకే ఓటీటీ లో పది వారాల తరువాతే స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నామని కూడా తెలియజేశారు.. అంటే దాదాపుగా సెప్టెంబర్ లో కల్కి సినిమా ఓటీటీలో వచ్చేలా ఉంటుందని తెలిపారు. కల్కి సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ , నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలు కొనుగోలు చేసినట్లు సమాచారం. కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ అద్భుతమైన నటనతో మెప్పించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు