Athadu: త్రివిక్రమ్ తప్పిపోయి 19 ఏళ్ళు అయింది

Athadu: ఉన్నతమైన చదువులు చదువుకొని ఆంధ్ర యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ తీసుకున్న ఒక వ్యక్తి సినిమా మీద ప్రేమతో ఇండస్ట్రీలో అడుగులు వేశారు. రచయితగా కొన్ని సినిమాలకి మాటలు కథలు అందించాడు. అయితే చాలామంది రచయితలు కాకుండా తనకంటూ ఒక సొంత శైలిని ఏర్పరచుకొని చాలామందిని ఆశ్చర్యానికి గురిచేశాడు. కేవలం ఈయన రాసిన డైలాగ్స్ వలన థియేటర్స్ కు వెళ్లే ఆడియన్స్ కూడా అప్పట్లో ఉండేవారు. రచయితగా కొన్ని సినిమాలకు పని చేసిన తర్వాత దర్శకుడిగా సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యాడు. ఒక మంచి కథను సిద్ధం చేసుకుని తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

రచయితగా ఈయనకు ఉన్న పరిచయాలతో ఒక స్టార్ హీరో దగ్గరకు కథ చెప్పడానికి వెళ్ళాడు. కథను బాగానే వివరించాడు. ఈ కథ చెబుతున్న టైంలో ఆ స్టార్ హీరో నిద్రపోయాడు. అయినా కూడా నిరాశ చెందకుండా సైలెంట్ గా తిరిగి వచ్చేసాడు ఈ దర్శకుడు. ఆ కథను విన్న స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ కథను చెప్పిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ కథ పేరు అతడు. అవును అతడు సినిమా పవన్ కళ్యాణ్ చేయాల్సింది. కానీ అది వర్కౌట్ కాలేదు.

ఈసారి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మరో స్టార్ హీరో మహేష్ బాబు దగ్గరికి వెళ్లి అతడు కథను చెప్పాడు త్రివిక్రమ్. మహేష్ బాబు కథ మొత్తం విన్నాడు ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపు బయటికి వెళ్లి అటు ఇటు తిరిగిన తర్వాత.. ఏమి లేదు ఇందాక నుంచి ఒకే చోట కూర్చున్నా కదా అందుకే ఇలా అని చెప్పాడు. ఈ సినిమాకి దర్శకుడుగా త్రివిక్రమ్ ఫిక్స్ అయిపోయాడు. అతడు సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ డెబ్యూ డైరెక్టర్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. అయితే త్రివిక్రమ్ మాట్లాడుతూ నేను స్రవంతి రవి కిషోర్ గారికి మొదటి సినిమా చేస్తానని మాట ఇచ్చాను. సో అక్కడ ఒక సినిమా చేసి తర్వాత మీతో పని చేస్తాను అని చెప్పాడు. త్రివిక్రమ్ స్రవంతి రవి కిషోర్ బ్యానర్ లో నువ్వే నువ్వే సినిమా చేసి ఆ తర్వాత అతడు సినిమా మహేష్ బాబుతో చేశాడు.

- Advertisement -

Athadu Movie

అతడు

పెను తుఫాను తలొంచి చూస్తే తొలి నిప్పు కణం అతడే,
ఈ మాట ఎంత పవర్ఫుల్ గా ఉందో సినిమా కూడా అలానే ఉంటుంది. ఈ సినిమాకి ఉన్న స్థానం వేరు స్థాయి వేరు. త్రివిక్రమ్ కెరియర్లో బెస్ట్ ఫిలిం అంటే మొదట అందరికీ గుర్తు వచ్చేది అతడు. హాలీవుడ్ రేంజ్ లో మేకింగ్ చేశాడు కొన్ని సీన్స్. ఏ ఎమోషన్స్ లేని ఒక క్రిమినల్ కి ఫ్యామిలీ ఎమోషన్స్ పరిచయమైతే ఎలా ఉంటాయో అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో కామెడీ డైలాగ్స్ ఎమోషన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమా కమర్షియల్ గా థియేటర్లో హిట్ కాకపోయినా కూడా ఇప్పటికీ మాటీవీలో వచ్చిన ప్రతిసారి హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకుంటుంది.

Athadu

ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ అద్భుతం ” నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం” “నువ్వు అడిగావని చెప్పలేదు, నేను నమ్మను కాబట్టి చెప్పాను” “దెయ్యం కంటే భయం మహా చెడ్డది” ఇలాంటి డైలాగ్స్ ఈ సినిమాలో అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. త్రివిక్రంలోని రైటర్, డైరెక్టర్ పోటీ పోటీగా పనిచేసిన సినిమా ఇది. ఆ తర్వాత ఈ రేంజ్ సినిమా త్రివిక్రమ్ నుంచి రాలేదు. ఆ త్రివిక్రమ్ ఎక్కడో మిస్ అయిపోయాడు. ఆ త్రివిక్రమ్ మళ్ళీ వస్తే చూడాలని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ త్రివిక్రమ్ తప్పిపోయి నేటికీ 19 సంవత్సరాలు అయింది.

19 years for Athadu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు