Atlee: సల్మాన్ ఖాన్ సినిమాలో కమలహాసన్ కీలక పాత్ర.?

Atlee: తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకులను అట్లీ ఒకరు. రాజా రాణి సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అట్లీ. అట్లీ ఆ సినిమాకి పని చేయడానికి అంటే ముందు ఇండియన్ జేమ్స్ కెమెరా అండ్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన త్రీ ఇడియట్ సినిమాని శంకర్ తమిళ్ లో రీమేక్ చేశాడు. ఈ సినిమాలో జీవా, విజయ్, శ్రీరామ్ నటించారు. ఈ సినిమాకి సహాయ దర్శకుడుగా పనిచేశాడు అట్లీ. అట్లీ మొదటి సినిమా తర్వాత కేవలం స్టార్ హీరోలతో మాత్రమే కలిసి పని చేశాడు.

తమిళ్లో అతిపెద్ద స్టార్ డం ఉన్న దళపతి విజయ్ తో మూడు సినిమాలు చేశాడు అట్లీ. ప్రతి సినిమా కూడా తెలుగులో డబ్బింగ్ అవుతూ వచ్చింది. ఇక్కడ కూడా ఆ సినిమాలకి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక దర్శకుడుగా తెలుగులో కూడా అల్లు అర్జున్ తో అట్లీ సినిమా చేస్తాడు అని వార్తలు కూడా వచ్చాయి. అయితే అట్లీ తన రెమ్యూనరేషన్ దాదాపు 80 కోట్ల వరకు డిమాండ్ చేయడంతో ఈ ప్రాజెక్టు కాస్త ఆగిపోయింది అని కథనాలు వినిపించాయి. కానీ దీని గురించి అధికార ప్రకటన రాలేదు.

Kamal Haasan

- Advertisement -

అట్టి బాలీవుడ్లో జవాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్ అయి కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు 1000 కోట్లకు పైగా జవాన్ సినిమా వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత మళ్లీ బాలీవుడ్ లోని సినిమా చేయనున్నాడు. సల్మాన్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇప్పుడు అందుతున్న కథనాలు ప్రకారం కమల్ హాసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు రజనీకాంత్ పేరు వినిపించేది కానీ ఇప్పుడు లేటెస్ట్ గా కమలహాసన్ పేరు వినిపిస్తుంది దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది అధికారిక ప్రకటన వచ్చేంత వరకు కూడా చెప్పలేము.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు