Raj Tarun : రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ పై దాడి.. కేసులో మరో ట్విస్ట్.. ఆమె కుట్రేనా ?

Raj Tarun : గత కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ రాజ్ తరుణ్ – లావణ్య కేసు.. ఈ కేసులో రోజుకో సంచలన నిజం బయటకు వస్తుంది.. మొన్నటివరకు లావణ్యను వాడుకొని వదిలేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అంతేకాదు ఆమెకు రాజ్ తరుణ్ కావాలని కేసుల మీద కేసులు పెట్టింది.. అది ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే.. ఇక రాజ్ తరుణ్ ఎఫైర్స్ గురించి కూడా నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి.. మాల్వి మల్హోత్రా తో ఎఫైర్ విషయం బయటపడింది. తాజాగా మాల్వి పై దాడి జరిగినట్లు ఓ వార్త షికారు చేస్తుంది..

మాల్వి మల్హోత్రా బాలీవుడ్ హీరోయిన్.. ఈమెతో ఒకటో రెండో సినిమాలు చేశాడు రాజ్ తరుణ్.. ఆమెతో పరిచయం వల్లే తనని పక్కన పెట్టేసినట్లు లావణ్య ఆరోపిస్తుంది.. అయితే నిన్న మాల్వి అసలు స్వరూపం ఇదే అంటూ బాలీవుడ్ నిర్మాత తల్లి వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట దుమారం రేపుతుంది.. ఇక మాల్వి పై గతంలో అనేకసార్లు దాడి జరిగినట్లు తెలుస్తుంది.. రెండు సార్లు ఆమె చావు వరకు వెళ్లి వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్.. ఇంతకీ దాడి చేసింది ఎవరో కాదు నిర్మాత యోగేష్.. అతన్ని దారుణంగా మోసం చేసిందని అతను చాలా సార్లు దాడి చేశారట.. ఆ తర్వాత పోలీస్ కేసు అవ్వడంతో అతను జైలుకు వెళ్లాడు..

Attack on Malvi Malhotra .. Photo viral in social media
Attack on Malvi Malhotra .. Photo viral in social media

అయితే తాజాగా రాజ్ తరుణ్ తో ఎఫైర్ అనే వార్త విన్న అతను బయట ఉన్న తన మనుషులతో హత్య చేయించే ప్రయత్నం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. యోగేష్ తల్లి ఆమెపై హత్యాప్రయత్నం చేయించిందనే టాక్ మరోవైపు నడుస్తుంది.. అంతే కాదు మాల్వి ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది.. ఇక రాజ్ తరుణ్ కేరీర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలుస్తుంది.. ఈరోజు పోలీసుల విచారణకు రాజ్ తరుణ్ హాజరు కావాల్సి ఉంది.. ఇక ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది.. రాజ్ తరుణ్ ఫ్రెండ్ ఒక అతను రాజ్ తరుణ్ ను సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేశాడు.. అవి కాస్త సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు