Raveena Tondon : కారు తో దాడి చేసిందంటూ.. రవీనా టాండన్ పై ముస్లిం మహిళల దాడి.. తప్పెవరిదో తేల్చిన సిసిటివి ఫుటేజ్..

Raveena Tondon : బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన సీనియర్ హీరోయిన్, ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ బిజీ అయింది. అయితే తాజాగా ఈమెపై జరిగిన ఓ దాడి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నిన్నటి నుండి ఈ వీడియో వైరల్ అవుతుంది. శనివారం (జూన్ 01) రాత్రి రవీనా టాండన్ ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై ముగ్గురు మహిళలను ఢీకొట్టిందని, సదరు ఓ ముస్లిం ఫ్యామిలీ మహిళలు ఆరోపిస్తూ ఆమె డ్రైవర్ పై దాడికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. ఇక రవీనా పై దాడి చేసిన ఆ వీడియోలో సదరు మహిళలు రవీనా డ్రైవర్ ని కొడుతుండగా, రవీనా (Raveena Tondon) పై కూడా చేయి చేసుకోబోయారు. అప్పటికి రవీనా తమని కొద్దొద్దని బతిమిలాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ గొడవలో రవీనా గాయపడిందా లేక ఆమె డ్రైవర్ గాయపడ్డారా అనేది తెలియలేదు.

Attack on Raveena Tondon .. CCTV footage that shows who is at fault in the issue

తమని ఢీకొట్టారంటూ బాధితుల ఆరోపణ..

ఆ దాడిపై సదరు మహిళల బాధిత కుటుంబ సభ్యుడు మహ్మద్ ఓ వీడియో కూడా చేసాడు. ఆ వీడియోలో ఇలా చెప్పుకొచ్చాడు.. నా పేరు మహమ్మద్. నేను బాంద్రా నివాసిని. మా అమ్మ, చెల్లి తదితరులతో కలిసి బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా, రవీనా టాండన్ కారు మా అమ్మను ఢీకొట్టిందని, దీంతో ఆమె ముక్కు, తలకు గాయమైందని, ఆ తర్వాత కూడా రవీనా టాండన్ కారు డ్రైవర్, అలాగే మద్యం మత్తులో ఉన్న రవీనా టాండన్ బయటకు వచ్చి అమ్మపై దాడి చేసారని ఆరోపించాడు. అలాగే రవీనాపై ఫిర్యాదు చేయడానకి పోలీసులు తమ మాట వినడం లేదని, తమకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామని మహ్మద్ ఈ వైరల్ వీడియోలో చెప్పుకొచ్చాడు.

- Advertisement -

రవీనా పై దాడి.. తప్పెవరిది?

ఇక ఈ ఘటనలో అసలు తప్పు ఎవరిది, కావాలని ఎవరు గొడవ చేశారనే దానిపై పోలీసులు క్లారిటీ ఇవ్వకముందే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ నెట్టింట వైరల్ అవుతోంది. అందులో అసలు తప్పు ఎవరిది అనేది చాలా క్లారిటీగా కనిపిస్తోంది. రవీనా టాండన్ తో పాటు ఆమె కారు డ్రైవర్ పై పలువురు మహిళలు, ఓ గుంపు దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాకుండా డ్రైవర్ ను కొడుతుంటే ఆపబోయిన రవీనాపై కూడా వాళ్లు దాడి చేశారు. అలాగే రవీనా కూడా వాళ్లను తిరిగి కొట్టిందని అక్కడి వాళ్లు ఆరోపించారు. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గంటల వ్యవధిలోనే అసలు తప్పు ఎవరిది అనే దానిపై ఈ సీసీటీవీ ఫుటేజీ క్లారిటీ ఇచ్చింది.

సీసీటీవీ ఫుటేజ్ తో తేలిపోయింది..

ఇక తాజాగా వచ్చిన ఆ సీసీటీవీ ఫుటేజీలో రవీనా కారు చాలా పక్క నుంచే వస్తుంది. ఆ కారు పక్కనే మరో కారు ఆగి ఉంది. అలాగే అక్కడి నుంచి పలువురు మహిళలు బుర్కాలు ధరించి అటువైపు వెళ్తున్నారు. కనీసం వారికి ఆనను కూడా ఆనకుండా రవీనా టాండన్ (Raveena Tondon) కారు వచ్చింది. కానీ ఆ గుంపులోంచి ఓ మహిళ వచ్చి రవీనా టాండన్ కారు డ్రైవర్ తో గొడవ పడింది. అక్కడ చాలా సేపు మాటల యుద్ధం జరగ్గా.. వారు పక్కకు వెళ్లారు. ఆ తర్వాత అసలు గొడవ జరిగింది. ఈక్రమంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రవీనా టాండన్ ఈ ఘటనపై స్పందించలేదు. అసలు తప్పు ఎవరిది అని చెప్పలేదు. కానీ సీసీటీవీ ఫుటేజీ చూసిన వారంతా రవీనాది తప్పేమీ లేదని.. తన డ్రైవర్ ను కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేసిందని అంటున్నారు. కావాలనే రవీనాపై వాళ్లు తప్పుడు ఆరోపణలు చేసిన గొడవను పెద్దది చేశారని అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో రవీనా క్లారిటీ ఇచ్చేస్తే మంచిదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు