#GoBackIndian : అవును నిజంగానే రావాల్సింది కాదు…

#GoBackIndian : కొన్ని సినిమాలుకు ఎప్పుడూ ఒక కల్ట్ స్టేటస్ ఉంటుంది. ఆ దర్శకులు అదే సినిమాను మళ్ళీ తీయాలన్నా కూడా అంత అద్భుతంగా అంత అందంగా తీయలేకపోవచ్చు. ఎందుకంటే మ్యాజిక్ అనేది అన్ని సార్లు వర్క్ అవుట్ అవ్వదు. దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమాలు తెలియక ముందే అద్భుతమైన కాన్సెప్ట్లను వెండితెరపై ఆవిష్కరించాడు శంకర్. అందుకనే శంకర్ ఇండియన్ జేమ్స్ కెమెరాన్ అని కూడా అంటారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్న రాజమౌళి సుకుమార్ త్రివిక్రమ్ వంటి దర్శకులు కూడా ఒకప్పుడు శంకర్ వర్క్ కి ఫిదా అయిపోయారు.

భారతీయుడు రేంజ్ వేరు

శంకర్ కెరియర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా భారతీయుడు సినిమాకి ఉన్న స్టేటస్ వేరు. అంత అద్భుతంగా సేనాపతి అనే క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు శంకర్. నిజంగా అలాంటి క్యారెక్టర్ ఉండి ఉంటే సమాజం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారతీయుడు సినిమా విషయానికి వస్తే ఆ సినిమాలో ఎమోషన్స్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. వీటన్నిటిని మించి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ వినసొంపుగా అనిపించింది. ఇప్పటికీ ఆ పాటలను చాలామంది పాడుకుంటూ ఉంటారు. కమలహాసన్ ఆ సినిమాలో నటించిన తీరు అద్భుతం. అందుకని పాతికేళ్లు దాటినా కూడా సేనాపతి ఇంకా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాడు.

శంకర్ నుంచి ఇలా ఎక్స్పెక్ట్ చేయరు

అంతటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా ఒక సినిమా వస్తుంది అని అంటేనే అందరి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. దాదాపు నాలుగేళ్ల క్రితమే మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో సినిమాకి వెళ్ళిన ప్రేక్షకులకి నిరాశ మిగిలింది అని చెప్పొచ్చు. శంకర్ లాంటి దర్శకుడు నుంచి ఇటువంటి సినిమాను ఎవరు ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉండరు.

- Advertisement -

గో బ్యాక్ ఇండియన్

సినిమాలో కమల్ వచ్చిన తర్వాత…. అవినితిని మీ ఇంటి నుంచే అరికట్టండి అంటాడు. దాని వల్ల నిజాయితీ గా ఉన్నవాళ్లు అందరూ లైక్ సిధార్థ్ లాంటి వాళ్లు… తమ ఫ్యామిలీలో లంచం తీసుకునే వాళ్లను పోలీసులకు పట్టిస్తారు. దీంతో వాళ్ల ఫ్యామిలీలకు అవమానాలు అవుతాయి. సూసైడ్ చేసుకుంటారు. అప్పడు.. గో బ్యాక్ ఇండియన్… స్టార్టింగ్ లో కమ్ బ్యాక్ ఇండియన్ అని ట్రెండ్ చేసింన సిద్ధార్తే ఇప్పుడు ఈ స్లోగన్ అని ట్రెండ్ చేస్తాడు. గో బ్యాక్ ఇండియన్.. అనే స్లైగన్ టైంలోనూ సినిమాపై ఆడియన్స్ బోరు కొడుతుంది. దీంతో నిజంగానే ఇండియన్ 2 అనసవరంగా వచ్చింది అనే ఫీల్ వస్తుందని ఆడియన్స్ అంటున్నారు.

ఇండియన్ తాత అనవసరంగా వచ్చాడు

సినిమా చూస్తున్నంత సేపు ఏదో జరుగుతుందో లే అనే ఫీల్ వస్తుంది. కానీ, ఏం జరగదు. దీంతో సినిమాపై నెగిటివ్ టాక్ వస్తుంది. సరైన టైంలో ఇండియన్ 2 రాలేదు అనేది ఆడియన్స్ నుంచి వస్తున్న టాక్. సనిమాలో ఇండియన్ తాత అనవసరంగా వచ్చాడు. ఇక్కడ సినిమా కూడా రాంగ్ టైంలో వచ్చింది అంటూ అప్పుడే ట్రోల్స్ కూడా మొదలయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు