Avasarala Srinivas: అవసరాలకి పెళ్లి అవసరం లేదా… ఆ మాటలేంటి గురూ..!

Avasarala Srinivas: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బ్యాచిలర్ హీరో అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ప్రభాస్.. నాలుగు పదుల వయసు దాటినా ఇంకా వివాహం చేసుకోకుండా ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నారు. ఇక ప్రభాస్ పెళ్లి కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే నిన్న మొన్నటి వరకు ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపించేవి. కానీ పెళ్లి టాపిక్ తీసేసరికి స్కిప్ కొడుతూ.. వస్తుంటాడు ప్రభాస్. ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్లి టాపిక్ కొన్ని నెలలుగా మీడియాలో రావడం లేదు. పైగా పెళ్లి చేసుకున్నప్పుడు చూద్దాంలే అన్నట్టుగా అంతా సైలెంట్ అయిపోయారు.

ఇక ఇలా ఒకసారి గమనించినట్లయితే పెళ్లి కాని ప్రసాద్ లు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. అలాంటి వారిలో అవసరాల శ్రీనివాస్ కూడా ఒకరు. విదేశాలలో ఉద్యోగం చేసి.. సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు శ్రీనివాస్. తనతో పాటు పనిచేసిన వారందరికీ పెళ్లిళ్లు అయిపోయి ఫ్యామిలీతో ఉంటే ఈయన మాత్రం ఇంకా వివాహానికి దూరంగానే ఉన్నారు. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో అడిగితే.. తనకు పెళ్లి అంటే ఏమాత్రం ఆసక్తి లేదు అని.. అందుకే వివాహం చేసుకోలేదని తెలిపారు.

“మొదటినుంచి వివాహానికి దూరంగా ఉన్నాను.. కానీ వివాహానికి వ్యతిరేకిని కాదు.. నాకు మాత్రం దాంపత్య జీవితం ఎందుకు అని బలంగా అనిపిస్తుంది. ఆ కారణంతోనే పెళ్లి ప్రయత్నాలు కూడా చేయలేదు.. ఇక చేసే ఆలోచన కూడా లేదు” అంటూ తెలిపాడు అవసరాల శ్రీనివాస్. ఇది చూసిన అందరూ అవసరాల జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలనుకుంటున్నాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

ఇకపోతే నటుడిగా, దర్శకుడిగా, రచయితగా కూడా అవసరాలు శ్రీనివాస్ కి మంచి పేరు ఉంది. ఇక ఈయన బాగా చదువుకున్నవాడు పైగా తెలివైనవాడు కూడా.. అందుకే ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్టు లేకపోయినా ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ సినిమా ప్రయత్నాలు చేసి, ఇప్పుడు ఇంతటి సక్సెస్ ను అందుకున్నారు. అయితే పెళ్లి చేసుకోను అని చెప్పేసరికి అభిమానులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఏది ఏమైనా అవసరాలు శ్రీనివాస్ ఒక్కసారిగా పెళ్లి తనకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పవచ్చు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు