Avatar3 : మూవీ లవర్స్ కి సెన్సేషనల్ న్యూస్.. అవతార్3 టైటిల్ & రిలీజ్ డేట్ వచ్చేసింది..

Avatar3 : హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటైన ‘అవతార్’ సిరీస్ గురించి మూవీ లవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ మూవీ లవర్స్ ని ఎంతో అలరించిన హాలీవుడ్ మూవీస్ లో ఇదొకటి. వేరే గ్రహంలో మనుషుల్లాంటి జీవరాసులు కూడా ఉండగా, భూమ్మీది నుండి మనుషులు పోయి అన్యాయంగా వారి సంపదను ఆక్రమించుకుంటే, వాళ్ళు ఎలా తిరగబడ్డారనే నేసథ్యంలో తెరకెక్కిన ఆ సినిమా హాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులని కూడా తిరగరాసింది. ఇక దానికి సీక్వెల్ గా పదేళ్ల తర్వాత “అవతార్ ది వే అఫ్ వాటర్” పేరిట రెండేళ్ల కింద సీక్వెల్ రాగా, ఆ సినిమా కూడా సేన్సేషనల్ విజయాన్ని నమోదు చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 2 బిలియన్ డాలర్లు వసూలు చేసిన ఆ సినిమా, విజువల్ వండర్ గా హాలీవుడ్ టాప్ 10 సినిమాల్లో ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అవతార్ మేకర్స్ నుండి సాలిడ్ అప్డేట్ వచ్చింది.

Avatar 3 movie title and release date announced

 

- Advertisement -

అవతార్3 రిలీజ్ డేట్ ఫిక్స్..

రెండేళ్ల కిందట “అవతార్ ది వే ఆఫ్ వాటర్” (Avatar3) సీక్వెల్ రాగా ఇప్పుడు, మూడో భాగం రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు మేకర్స్. కాసేపటికిందే మూడో భాగం వస్తుందని మేకర్స్ ప్రకటించగా, దాంట్లో టైటిల్, సహా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. ఇక మూడో పార్ట్ కి “అవతార్ ఫైర్ అండ్ ఆష్” అనే టైటిల్ ని ఖరారు చేయగా, ఈ భారీ చిత్రం నెక్స్ట్ ఇయర్ 2025 డిసెంబరు 19న థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అవతార్ మూవీ ఫ్యాన్స్ కి ఇది క్రేజీ న్యూస్ అని చెప్పాలి. ఇక అవతార్ కి నాలుగో భాగం కూడా తెరకెక్కుతుండగా, ఆ సినిమా బహుశా 2029 లో రావచ్చని, అదే ఫైనల్ పార్ట్ అని సమాచారం.

ఈసారి నిప్పుతో…

ఇక అవతార్ ఫస్ట్ పార్ట్ వేరే గ్రహంలో నేలపై అడవుల్లో జరిగే యుద్ధం నేపథ్యంలో తెరకెక్కగా, రెండో పార్ట్ నీటి మీద జరిగే యుద్ధాన్ని చూపించాడు. ఇక మూడో పార్ట్ ని నిప్పును ప్రధానంగా చేసుకుని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇక ‘అవతార్ ఫైర్ అండ్ ఆష్’ తో ఈసారి సరికొత్త రికార్డులు క్రియేట్ అవడం ఖాయమని అంటున్నారు నెటిజన్లు. ఇక హాలీవుడ్ లో భారీ వసూళ్లు సాధించిన సినిమాల్లో మార్వెల్ మూవీస్, జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఇది వాటిలో సరికొత్త రికార్డ్ సెట్ చేస్తుందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు