Avika Gor : అతనితో ఆల్రెడీ పెళ్లయిపోయింది… బాంబ్ పేల్చిన చిన్నారి పెళ్ళికూతురు

Avika Gor : యంగ్ హీరోయిన్ అవికా గోర్ తాజాగా తనకు ఎప్పుడో పెళ్లయిపోయిందని బాంబు పేల్చింది. అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్ ఎలా పరిచయమయ్యాడు? ఎప్పుడు ప్రపోజ్ చేశాడు? ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అనే విషయాలను తాజాగా బయట పెట్టి ఊహించని షాక్ ఇచ్చింది. మరి అవికా పెళ్లి ఎప్పుడు జరిగింది? అనే వివరాల్లోకి వెళ్తే…

బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి రూమర్లు

బుల్లితెరను ఊపేసిన డబ్బింగ్ సీరియల్స్ లో చిన్నారి పెళ్లికూతురు కూడా ఒకటి. ఇందులో ఆనంది పాత్రలో చిన్నారి అవికా గోర్ బుల్లితెర ప్రేక్షకుల మనుసులను దోచుకుంది. ఇక ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ చేసిన ఫస్ట్ తెలుగు మూవీ ఉయ్యాల జంపాల. ఈ సినిమాలో నటించినప్పుడు అవికాకు కేవలం 15 ఏళ్లే. ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ తర్వాత తెలుగు, హిందీ, మరాఠీ సినిమాల్లో ఈ అమ్మడికి ఆఫర్స్ వచ్చాయి. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్, సీరియల్ తో బిజీగా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ బ్లడీ ఇష్క్ అనే హిందీ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా ఉంది. విక్రమ్ భట్ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ డైరెక్ట్ గా జూలై 26న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. బ్లడీ ఇష్క్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ చిన్నారి పెళ్లికూతురు తనకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది అంటూ చెప్పి షాక్ ఇచ్చింది. తన చిరకాల మిత్రుడు, ప్రియుడు మిలింద్ చాంద్వానితో ఈ బ్యూటీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందంటూ రూమర్ల వచ్చాయి. తాజాగా ఈ రూమర్లపై స్పందించింది అవికా.

అలాగే అతను  ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు.. ఇండస్ట్రీవాడు కాదు. . ముందు మేము ఫ్రెండ్స్ లా ఉన్నామా ఆతర్వాత అతను నాకు ప్రపోజ్ చేశాడు. మా ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటి కావడంతో నేను కూడా ఓకే చెప్పాను. మిలింద్ చాలా మంచి వాడు. నా దృష్టిలో మానసికంగా మా ఇద్దరికి పెళ్లైంది. మేము ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటాం అని తెలిపింది. 

- Advertisement -

ఎప్పుడో పెళ్లయిపోయింది!?

అయితే ఎన్నో ఏళ్ల నుంచి అవికా సీక్రెట్ గా తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంది అంటూ రూమర్లు వినిపిస్తుండగా, ఎట్టకేలకు ఓ పాడ్ కాస్ట్ లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. 2020లో హైదరాబాద్ లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మిలింద్ ని కలిశానని, అయితే మొదటి ఆరు నెలలు తామిద్దరం స్నేహితులుగానే ఉన్నామని వెల్లడించింది. కానీ అతను ఒక సోషల్ వర్క్ ప్రొఫెషనల్, గొప్పగా అర్థం చేసుకుంటాడు అంటూ తన బాయ్ ఫ్రెండ్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న వీళ్ళిద్దరూ ఎట్టకేలకు పెళ్లి దాకా వెళ్లారు. ముందుగా మిలింద్ తనకు ప్రపోజ్ చేశాడని, ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటే కావడంతో తను వెంటనే ఓకే చెప్పానని చెప్పుకొచ్చింది అవికా. అంతేకాకుండా నా దృష్టిలో మానసికంగా మా ఇద్దరికీ ఎప్పుడో పెళ్లి అయిపోయింది, ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అంటూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అయితే ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉండడంతో దాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని మిలింద్ చెప్పాడని, అందుకే ఆలోచిస్తున్నాను అంటూ మళ్ళీ సస్పెన్స్ లో పడేసింది. మొత్తానికి తనకు పెళ్లి కాలేదు అనే విషయాన్ని ఇలా ఇన్ డైరెక్టుగా బయటపెట్టింది అవికా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు