Avika Gor: స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న అవికా గోర్

అందాల నటి అవికా గోర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలికా వధు అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకుంది అవికా. ఇక అదే సీరియల్ నీ చిన్నారి పెళ్లికూతురు అనే పేరుతో తెలుగులో డబ్ చేసి ప్రచారం చేశారు. ఈ సీరియల్ కి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

ఈ సీరియల్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ ముద్దుగుమ్మకి 2013 లో ఉయ్యాల జంపాల అనే సినిమాలో అవకాశం దక్కింది. ఈ చిత్రంలో అవికా గోర్ నటనకు, అందచందాలకు తెలుగు ప్రేక్షకులు నుంచి మంచి రెస్పాన్స్ దక్కడంతో ఆ తర్వాత సినిమా చూపిస్త మామ, రాజు గారి గది 3, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి పలు చిత్రాలలో అవకాశాలు వచ్చి పడ్డాయి. ఇక ఆ మధ్య ఫిలిం కోర్స్ చేయడానికి అవిక కొన్ని రోజులు సినిమాలకు కూడా దూరమైంది.

ఇప్పుడు సడన్ గా అవికా తన రూట్ చేంజ్ చేసింది. హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా మారింది. సాయి రోనాక్ – అవికా గోర్ జంటగా నటించిన తాజా చిత్రం పాప్ కార్న్. మురళి గంధం దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

- Advertisement -

ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్ పై భోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అవికా గోర్ మాట్లాడుతూ.. 25 ఏళ్ల వయసులోనే సహనిర్మాతగా తొలి అడుగు వేసినందుకు ఆనందంగా ఉంది అంటూ భావోద్వేగానికి గురైంది అవికా. ఇందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని చెప్పుకొచ్చింది. తెలుగులో తన మొదటి సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ తోనే ప్రారంభమైందని.. ఆ సినిమాతోనే నాగార్జునతో పరిచయం ఏర్పడిందని చెప్పుకొచ్చింది.

నేను ఈ సినిమాకు నిర్మాతగా చేయడం రిస్క్ అని అన్నారు.. కానీ నేను ఆ రిస్కు తీసుకోవడం ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానని చెప్పింది. తనని ఈ రిస్క్ తీసుకోవడానికి సపోర్టు చేసిన తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు ప్రేక్షకులను ఎప్పటికీ మరిచిపోలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు