Avika Gor : బౌండరీలు దాటేస్తున్న అవికా గ్లామర్… చూపుల్లో ఏదో మ్యాజిక్ ఉంది…

Avika Gor : టాలీవుడ్ లో ఉన్న యంగ్ టాలెంటెడ్ హీరోయిన్లలో “అవికా గోర్” ఒకరు. ఉయ్యాలా జంపాల అనే చిన్న సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ కొట్టి ట్రెండ్ అయిన అవికా గోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అంతకంటే ముందే చిన్నారి పెళ్లికూతురు లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫేమ్ సంపాదించి బుల్లితెరపై ఓ రేంజ్ లో పాపులర్ అయింది. ఆ తర్వాత ఈ అమ్మాయి టాలీవుడ్ లోనే ముందు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఫస్ట్ సినిమానే సూపర్ హిట్ అవడంతో చిన్న సినిమాల్లో ఆఫర్లు వెల్లువెత్తాయి. సినిమా చూపిస్తా మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సినిమాలతో జోరు చూపించింది. అయితే ఆ తర్వాత వరుస ప్లాపులు కూడా పలకరించడంతో ఎంత స్పీడ్ గా సినిమాలు చేసిందో, అంతే స్పీడ్ గా ఆఫర్లు తగ్గిపోయాయి. అయినప్పటికీ టాలీవుడ్ ని వీడలేదు అవికా గోర్. ఇక్కడ వచ్చిన గుర్తింపు అలాంటిది మరి. ఇక అప్పుడప్పుడూ ఫోటోషూట్లతోనూ రచ్చ చేస్తూ ఉంటుంది ఈ అమ్మడు.

Avika Gor Latest Hot Photoshoots Wiral On Social Media

ఫోటోషూట్లలోనూ రచ్చ…

ఇదిలా ఉండగా అవికా గోర్ (Avika Gor) సోషల్ మీడియా లో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. లేటెస్ట్ గా నెట్టింట అప్లోడ్ చేసిన ఫోటోలు మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అవికా గోర్ బ్లాక్ కలర్ స్టైలిష్ డ్రెస్ లో నలుపు అందాలతో రచ్చ చేస్తుంది. మత్తెక్కించే కళ్ళతో చూపు తిప్పనివ్వడం లేదు. ఇక ఇలాంటి పోటోషూట్లు ఈ అమ్మడికి కొత్తేమి కాదు. సినిమాల్లో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో, ఫోటోషూట్లలోనూ ఈ అమ్మాయి అంతే యాక్టీవ్ గా ఉంటూ యూత్ ని టార్గెట్ చేస్తుంది. ఇక తన గ్లామర్ షో తో ఎప్పుడో బౌండరీలు దాటేసిందని చెప్పాలి. ఇక సినిమాల పరంగా మాత్రం సక్సెస్ ని అంతగా కంటిన్యూ చేయలేకపోతోందని చెప్పాలి. రెండేళ్ల కింద నాగ చైతన్య థ్యాంక్ యూ లో చిన్న రోల్ లో నటించిన ఈ అమ్మాయి ఇప్పటివరకు టాలీవుడ్ లో సరిగా కనిపించలేదు. ఎదో రెండు సినిమాల్లో చిన్న రోల్స్ చేసింది.

- Advertisement -

అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్ లతో రచ్చ..

అయితే అవికా గోర్ కి వరుస బెట్టి ఆఫర్లు రాకపోయినా, అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉంది. లాస్ట్ ఇయర్, హాట్ స్టార్ లో “వధువు” అనే వెబ్ సిరీస్ లో నటించిన అవికా గోర్, పాప్ కార్న్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక హిందీలో 1920 హర్రర్ అఫ్ ది హార్ట్ అనే సినిమాలో కూడా నటించగా, ఇక ఈ ఇయర్ లో తాజాగా ‘ఉమాపతి’ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. దీంతో పాటు “అగ్లీ స్టోరీ” అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. రెండేళ్ల ముందు వరకు ఒక్క సినిమా ఛాన్స్ కోసం ఎదురు చూసిన ఈ సీరియల్ పిల్ల, ఇప్పుడు ఒక్క తెలుగు, హిందీలో కలిపి నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. ‘ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలని’ పెద్దలు చెప్పిన ఓ సామెతని అవికా గోర్ చక్కగా ఫాలో అవుతుందని చెప్పాలి. ఇక అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ లు, మధ్య మధ్యలో ఇలా ఘాటు అందాల ఆరబోతతో నెట్టింట వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు