Aye Jude: ఆరేళ్లుగా నాకు కుటుంబంతో సంబంధాలు లేవు

Aye Jude: ఒకప్పుడు ఏదైనా కొత్త విషయం తెలియాలి అంటే న్యూస్ పేపర్ చదవడం వలన, టీవీలు చూడటం వలన తెలిసేది. కానీ ఇప్పుడు అంతా సోషల్ మీడియాలోనూ తెలిసిపోతుంది. సోషల్ మీడియాను ఉపయోగించుకొని చాలామంది పైకి వస్తున్నారు. కొంతమంది సినిమా రంగంలో కూడా తమ ప్రతిభను చూపిస్తున్నారు. అలానే కొంతమంది ప్రేక్షకులను కూడా హింసిస్తున్నారు. ఇకపోతే కామెడీ పేరుతో ఎన్నో అసభ్యమైన కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. నలుగురు నవ్వుతారు కదా అని ఒక జోక్ వెయ్యటం వలన మనం చాలా రిస్క్ లో పడే అవకాశం ఉంది.

ఇకపోతే రీసెంట్ గా యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ముందుగా సినిమాలను ట్రోల్ చేసే ప్రణీత్, ఆ తర్వాత రీల్స్ ను కూడా ట్రోల్ చేస్తూ చాలామందిని పర్సనల్ గా టార్గెట్ చేయడం కూడా మొదలుపెట్టాడు. ఇకపోతే ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్య జరిగిన ఒక క్యూట్ వీడియోని, చాలా అబ్యుజ్ గా కామెంట్స్ చేసి జుగుప్సకరమైన బూతులను వాడాడు. అయితే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో సాయిధరమ్ తేజ్ చాలామంది రాజకీయ ప్రముఖులను సినీ ప్రముఖులను ట్యాగ్ చేసి వీళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ప్రణీత హనుమంతు మ్యాటర్ చాలా సీరియస్ గా మారింది.

Ajay Hanumanthu

- Advertisement -

ఇకపోతే ప్రణీత్ హనుమంతు అన్నయ్య ఏ జ్యుడ్ కూడా ఒక ఫేమస్ యూట్యూబ్. బట్టల గురించి తన యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఇక ప్రణీత్ ఈ విషయంలో చిక్కుకోవడం వలన అందరూ జ్యుడ్ ను కూడా బయటకు తీసే ప్రయత్నం చేశారు. దీనిపై జ్యుడ్ స్పందిస్తూ నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ లో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా దగ్గర సింగిల్ రూపీ కూడా లేదు. అప్పటినుంచి నేను ఇంటికి చాలా దూరంగా ఉన్నాను. అంటూ స్పందించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు