Atharva : ఫుల్ గ్లామ‌ర్

యంగ్ హీరో కార్తీక్ రాజు ప్ర‌ధాన పాత్ర‌లో పెగ్గో ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న చిత్రం అధర్వ. ఈ సినిమా ప్రారంభం నుంచే భారీ ఎక్స్‌పెక్టేష‌న్ క్రియేట్ చేస్తున్నారు మూవీ మేక‌ర్స్‌. ముఖ్యంగా చిత్ర బృందం చేసే ప్ర‌మోష‌న్లు ఆస‌క్తి క‌లిగిస్తున్నాయి. క్రైమ్ థిల్ల‌ర్ మూవీగా డిఫ‌రెంట్ కాన్సెప్ట్ ట‌చ్ చేస్తూ రాబోతున్న సినిమాకి మ‌హేష్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

సుభాష్ నూత‌న‌పాటి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి విజ‌య‌, ఝాన్సీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్లు. నూత‌ల‌పాటి న‌ర‌సింహం, అన‌సూయ‌మ్మ స‌మ‌ర్ప‌ణ‌లో తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాల భాష‌ల్లో ఏక‌కాలంలోనే ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని ప్ర‌ణాళిక వేస్తున్నారు మేక‌ర్స్‌. అధ‌ర్వ చిత్రానికి ‘ది సీక‌ర్ ఆఫ్ ది ట్రూత్’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌద‌రి, ఐరా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఇక ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన‌ టైటిల్ లోగో, మోష‌న్ పోస్ట‌ర్ ల‌కు విశేష‌మైన స్పంద‌ల ల‌భిస్తోంది.

తాజాగా ‘ఐరా’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్ ద్వారా ఐరా గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంటుంద‌నే అర్థ‌మ‌వుతోంది. ‘నేను న‌మ్మిన స‌త్యం, వెతికే ల‌క్ష్యం, దొర‌కాల్సిన సాక్షం సాధించే వ‌ర‌కు ఈ కేసును వ‌దిలిపెట్ట‌ను సార్’ అంటూ మోష‌న్ పోస్ట‌ర్ లో డైలాగ్ అధర్వ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి డీజే టిల్లు, మేజ‌ర్ వంటి చిత్రాల‌కు మ్యూజిక్ అందించిన శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చారు. అతి త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు