Babu Gogineni : ఎన్టీఆర్ పై బిగ్ బాస్ ఫేమ్ బాబు గోగినేని షాకింగ్ ట్వీట్.. దొంగచుట్టమా?

Babu Gogineni : తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల కింద వెలువడిన కొత్త పలితాలతో ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త టిడిపి జయకేతనం ఎగరేసిందన్న సంగతి తెలిసిందే. అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా టిడిపి త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇక ఈ సందర్బంగా సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రబాబు నాయుడు, అలాగే టిడిపిని ట్యాగ్ చేస్తూ అందరు నేతలని ప్రశంసిస్తూ అభినందనలు తెలియచేస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తాజాగా టిడిపి గెలిచాక చంద్రబాబు నాయుడు,బాలకృష్ణ సహా అందర్నీ ప్రత్యేకంగా విష్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. ఇక ఈ ట్వీట్ నెట్టింట వైరల్ కాగా, తాజాగా ప్రముఖ సోషల్ యాక్టీవిస్ట్ కం హ్యూమనిస్ట్, అలాగే బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన బాబు గోగినేని (Babu Gogineni) జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ పై వ్యంగంగా కామెంట్స్ చేసారు.

Babu Gogineni Shoking Tweet On Junior NTR

దొంగ చుట్టం అంటూ..

ఇక ప్రముఖ యాక్టివిస్టు కం హ్యుమనిస్టుగా పేరున్న బాబు గోగినేని బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇవ్వటం ద్వారా సాదాసీదా తెలుగు ప్రజలకు సైతం సుపరిచితుడయ్యాడు. ఆయనలోని షేడ్స్ తో బిగ్ బాస్ షో నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన బాబు గోగినేని సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబునాయుడు అలాగే ఎన్నికల గెలుపుని విష్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన అభినందన ట్వీట్ కు బాబు గోగినేని షాకింగ్ రీట్వీట్ చేశారు. ఇక తారక్ పోస్టు చేసిన ట్వీట్ లో చంద్రబాబును ప్రియమైన మావయ్య అని.. బాలక్రిష్ణను బాబాయ్ అని.. పురంధేశ్వరిని అత్తగా పేర్కొంటూ వారు సాధించిన విజయాలకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే.. ఈ ట్వీట్ కు తీవ్రమైన కౌంటర్ ఇచ్చారు బాబు గోగినేని. ఆయన పోస్టులో ఏమని పేర్కొన్నారంటే.. ‘ఏ తాత పేరు తనకు పెట్టారో.. ఆ తాత స్థాపించిన వైద్య విశ్వవిద్యాలయానికి ఉన్న తన తాత పేరును తీసేసి అప్పటి ముఖ్యమంత్రి తన సొంత తండ్రి పేరు పెట్టుకున్నప్పుడు విమర్శించటం కూడా చేతకాని ధైర్యం లేని హీరో. ఇప్పుడు ఫ్యామిలీ లవ్వు ఒలకపోస్తున్నాడు’’ అని పేర్కొన్నారు. దీనికి “దొంగ చుట్టం” ట్వీట్ చేశాడన్న అర్థం వచ్చేలా టైటిల్ పెట్టి పోస్టు చేశారు.

- Advertisement -

https://x.com/GogineniBabu/status/1798569219627556950

ఎన్టీఆర్ పై డైరెక్ట్ ట్రోలింగ్..

ఇక బాబు గోగినేని (Babu Gogineni) ట్వీట్ కు తారక్ అభిమానులు రిప్లై ఇస్తూ మాత్రం ఆయన్ను తప్పు పట్టటం సరికాదంటున్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ ను కానీ ఎప్పుడూ తారక్ శుభాకాంక్షలు చెబుతూ పోస్టు పెట్టలేదని.. ఆయన ఎప్పుడూ తెలుగుదేశం వైపే ఉన్నట్లుగా వాదిస్తున్నారు. మరోవైపు.. పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు.. బయటకు రాని తారక్ ఎన్నికల్లో ఘన విజయాన్నిసాధించినంతనే శుభాకాంక్షలు చెప్పటాన్ని.. చంద్రబాబును మావయ్య అంటూ సంబోధించటాన్ని తప్పు పడుతున్నారు. ఏది ఏమైనా బాబు గోగినేని పోస్టు వైరల్ గా మారింది. ఇక మరో రెండు రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎపి మంత్రులతో సహా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు