Mahesh Babu: బాబు బాగా బిజీ… ఎంత బిజీ షెడ్యూల్ అంటే?

Mahesh Babu: స్టార్స్ అన్నాక అభిమానులను అలరించడమే వాళ్ళ పని. తమను ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేయడం కోసం చాలామంది హీరోలు క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఉంటారు. వాళ్ళ బిజీ షెడ్యూల్ చూస్తే షాక్ అవ్వడం ఖాయం. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న బిజీ షెడ్యూల్ చూసిన వారెవరికైనా తల తిరిగిపోతుంది. మరి మహేష్ బాబు ఎంత బిజీ షెడ్యూల్ లో వర్క్ చేస్తున్నారు అంటే…

టాలీవుడ్ లోని అత్యంత బిజీ స్టార్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ప్రస్తుతం ఈయన “గుంటూరు కారం” అనే యాక్షన్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో మహేష్ బాబు సరసన యంగ్ హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న “గుంటూరు కారం” మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఇక షూటింగ్ పూర్తయ్యాక జరిగే ప్రమోషనల్ కార్యక్రమాలు వంటి ఈవెంట్లు కూడా చేయాల్సి ఉంటుంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ అనుకున్న టైంకు షూటింగ్ ను పూర్తి చేయలేకపోయారు మేకర్స్. దీంతో టీంపై ప్రెజర్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం “గుంటూరు కారం” మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్న మహేష్ బాబు న్యూ ఇయర్ వెకేషన్ కోసం కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లబోతున్నాడు. ఇక ఈ ట్రిప్ ముగించుకుని వచ్చాక “గుంటూరు కారం” మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటాడు.

- Advertisement -

ఎక్కువ టైం లేకపోవడంతో ఒకే ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారట “గుంటూరు కారం” మేకర్స్. అలాగే మహేష్ బాబు ఇంటర్వ్యూ కూడా ఉండబోతోంది. “గుంటూరు కారం” మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే ఫ్యామిలీతో కలిసి మరొక చిన్న ట్రిప్ వేయబోతున్నాడు మహేష్ బాబు. ఆ ట్రిక్ కూడా పూర్తయ్యాక తిరిగి వచ్చిన వెంటనే తన నెక్స్ట్ మూవీ ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఇలా మహేష్ బాబు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన టైట్ షెడ్యూల్ ని చూసిన ఫ్యాన్స్ బాబు బాగా బిజీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కానీ కొంతమంది మాత్రం “గుంటూరు కారం” మూవీ రిలీజ్ కు ఎక్కువ టైం లేదు కాబట్టి వెకేషన్ కు వెళ్లకుండా సినిమా ప్రమోషన్ల మీద ఆయన దృష్టి పెడితే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం సినిమాకు ఎంత ప్రాధాన్యతను ఇస్తాడు తన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యతనిస్తాడు. సినిమా పూర్తయిన వెంటనే వెకేషన్ కు వెళ్లి కుటుంబంతో కలిసి సరదాగా గడిపి, అలా సేద తీరుతూ ఉంటాడు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు