Bacchala Malli Controversy : అల్లరి నరేష్‌పై హిందువులు ఫైర్… సినిమాను బ్యాన్ వేయాలని డిమాండ్

Bacchala Malli Controversy : రీసెంట్ గా ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ తాజాగా కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో బచ్చల మల్లి సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అయితే అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ లోని ఓ సన్నివేశం వివాదాన్ని రేకెత్తిస్తోంది. ఏకంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

బ్యాన్ చేయాలంటూ డిమాండ్…

1992 నేపథ్యంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ బచ్చల మల్లి. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ డైరెక్టర్ సుబ్బు మంగాదేవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే హనుమాన్ సినిమాతో సక్సెస్ అందుకున్న హీరోయిన్ అమృత అయ్యర్ ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన రొమాన్స్ చేస్తోంది. సెప్టెంబర్ లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లు కూడా షురూ చేశారు. అయితే హీరో అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా సపరేట్ గా టీజర్ ను రిలీజ్ చేసి విష్ చేశారు మేకర్స్. మరోవైపు ఆయన అభిమానులకు ఈ ట్రీట్ తెగ నచ్చింది. కానీ తాజాగా ఈ టీజర్ వల్ల అల్లరి నరేష్ పై మండిపడుతున్నారు నెటిజన్లు.

Naresh's Bachhala Malli Glimpse: Breathtakingly Intense

- Advertisement -

టీజర్ స్టార్ట్ అవ్వగానే హీరో ఉదయాన్నే నిద్ర లేచి తన నిద్రను డిస్టర్బ్ చేసిన ఓ మైక్ ను చికాకుతో నేలకేసి కొట్టడం చూపించారు. అయితే అల్లరి నరేష్ అలా తీసి కింద పడేసిన ఆ మైక్ లో ఆ టైంలో భగవద్గీత ప్లే అవుతూ ఉండడమే సమస్యగా మారింది. ఈ సీన్ పై పలువురు హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాము ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీతను వినిపించే మైక్ ని నేలపై విసిరి కొట్టడం ఏంటి అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా ఆ సీన్ ను టీజర్ నుంచి తీసేయాలని, లేదంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కారణంగా ఈ సినిమానే బ్యాన్ చేసేదాకా ఊరుకోమని వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా హీరోతో పాటు నిర్మాతలు కూడా హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ముఖ్యంగా అల్లరి నరేష్ దీనిపై వివరణ ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

రిలీజ్ కి ముందే వివాదాలు..

అల్లరి నరేష్ మైక్ పగలగొట్టడం అనే వివాదం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే అంతకంటే ముందే బచ్చల మల్లి సినిమా ఫస్ట్ లుక్ కూడా వివాదాస్పదమైంది. అచ్చం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ను పోలినట్టుగానే బచ్చల మల్లి సినిమాలో నరేష్ లుక్ ఉందని కామెంట్స్ చేశారు. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం నరేష్ రగ్గడ్ అండ్ రస్టిక్ లుక్ అదుర్స్ అంటున్నారు. మరి మేకర్స్ ఆ మైక్ సీన్ వివాదంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు