Bachchala Malli : అల్లరి నరేష్ బర్త్ డే ట్రీట్ రెడీ అవుతుంది, నెవర్ బిఫోర్ లుక్

Bachchala Malli : యంగ్ హీరో అల్లరి నరేష్ ఇటీవల కాలంలో పంథా మార్చి కొత్త కొత్త సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన బర్త్ డే సందర్భంగా ఓ ట్రీట్ లోడ్ అవుతోంది. మరి అదేంటో ఓ లుక్కేద్దాం పదండి.

బర్త్ డే ట్రీట్ లోడింగ్

అల్లరి నరేష్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో బచ్చలమల్లి అనే సినిమాను చేస్తున్నాడు. అయితే అల్లరి నరేష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జూన్ 30న ఉదయం 9 గంటలకు ఈ గ్లిమ్స్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇక రిలీజ్ చేసిన పోస్టర్లు రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్నాడు అల్లరి నరేష్. ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. దాదాపు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గెటప్ కి దగ్గరగా ఉందని కూడా చెప్పొచ్చు. దీంతో ఈసారి ఎలాగైనా అల్లరి నరేష్ కు హిట్ పడడం ఖాయం అంటున్నారు.

- Advertisement -

కెరీర్ అంతా హెచ్చుతగ్గులే..

అల్లరి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లరి నరేష్. అయితే అల్లరి నరేష్ కి ఎక్కువ హిట్ సినిమాలు తన తండ్రి ఇవీవీ సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చాయి. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో ఇవివి సత్యనారాయణ ఒకరు. ఆయన సినిమాలంటే కుటుంబ సమేతంగా ప్రేక్షకులు చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో సినిమాను చేసే వాళ్ళు ఇవివి. అలానే ఎక్కువ శాతం సినిమాల్లో కామెడీకి కూడా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఇక అల్లరి నరేష్ చేసిన సినిమాలు ఎక్కువ శాతం కూడా కామెడీ సినిమాలే ఉండేవి. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ ఒకప్పుడు కామెడీ సినిమాలు చేసినట్టు అల్లరి నరేష్ కూడా వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో నిలబడ్డాడు. అయితే ఇవివి సత్యనారాయణ చనిపోయిన తర్వాత అల్లరి నరేష్ చేసిన కామెడీ సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. కామెడీ సినిమాలతో పాటు ప్రత్యేకమైన పాత్రలు కూడా పోషించేవాడు అల్లరి నరేష్.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా..

ఇక అల్లరి నరేష్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చిన పాత్ర అంటే గమ్యంలో గాలి శీను అని చెప్పొచ్చు. క్రిష్ జాగర్లమూడి దర్శకుడుగా పరిచయమైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో అల్లరి నరేష్ లో ఎంత గొప్ప యాక్టర్ ఉన్నాడా అని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కూడా ఒక కీలకపాత్రలో కనిపించాడు.

ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ సీరియస్ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నాంది అనే సినిమా వచ్చి మంచి సూపర్ హిట్ గా నిలిచింది. మళ్లీ వీరి  కాంబినేషన్ లో వచ్చిన ఉగ్రం సినిమా పరవాలేదు అనిపించింది. ఇక రీసెంట్ గా ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు అల్లరి నరేష్. ఆ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు