Bad Newz Censor : సెన్సార్ కత్తెరకు బలైన త్రిప్తి కష్టం… ఆ సీన్లు లేనట్టే?

Bad Newz Censor : త్రిప్తి దిమ్రి అనగానే మూవీ లవర్స్ కు యానిమల్ సినిమాలో ఆమె చేసిన కొన్ని సెకండ్ల ఇంటిమేట్ సీనే గుర్తొస్తుంది. సినిమాలో ఆమె పాత్ర చిన్నదే అయినా ఇంపాక్ట్ మాత్రం ఎఫెక్టివ్ గా పడింది. సినిమాలో నటించిన హీరోయిన్ రష్మిక మందన్న కంటే త్రిప్తి పేరు మార్మోగింది. అయితే అదే ఫేమ్ ను కంటిన్యూ చేద్దాం అనుకుందో ఏమోగానీ తన నెక్స్ట్ మూవీలో ఊహించని సీన్స్ చేసి షాక్ ఇచ్చింది. బ్యాడ్ న్యూస్ అనే హిందీ మూవీలో ఏకంగా సాఫ్ట్ పోర్న్ అని విమర్శించే స్థాయిలో అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోయి నటించింది. కానీ ఆమె కష్టం అంతా ఇప్పుడు వేస్ట్ అయిపోయింది. త్రిప్తి అంత కష్టపడి చేసిన అలాంటి సీన్స్ కు తాజాగా సెన్సార్ కత్తెర వేసినట్టు సమాచారం.

బ్యాడ్ న్యూస్ మూవీకి సెన్సార్ కత్తెర

విక్కీ కౌశల్ తాజా చిత్రం బ్యాడ్ న్యూజ్ జూలై 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్‌తో పాటు త్రిప్తి డిమ్రీ, అమీ విర్క్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సెన్సార్ కు వెళ్ళగా, సినిమాలో 27 సెకన్ల లిప్ లాక్ సీన్స్ ను మార్చాలని సెన్సార్ బోర్డు కోరినట్టు తెలుస్తోంది. ఈ సన్నివేశాలు విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ మధ్య మూడు విభిన్న ముద్దు సన్నివేశాలని, ఒక సన్నివేశం 9 సెకన్లు, మరొకటి 10 సెకన్లు, మూడవది 8 సెకన్లు, మొత్తం 27 సెకన్ల ముద్దు సన్నివేశాలను తీసేయమని చెప్పారట.

SCOOP: Karan Johar directed Triptii Dimri and Vicky Kaushal's passion in  'Jaanam' : Bollywood News - Bollywood Hungama

- Advertisement -

బ్యాడ్‌న్యూస్‌ విడుదలకు కొన్ని రోజులే మిగిలి ఉంది. గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సినిమాలో కొన్ని మార్పులు చేయవలసిందిగా కోరింది. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, విక్కీ, త్రిప్తి మధ్య ఉన్న మూడు ముద్దు సన్నివేశాలు లేకుండా చేయాలని సెన్సార్ బోర్డు చిత్ర బృందానికి సూచించింది. అయితే ఆడియోను తొలగించలేదు. సినిమాలో ఉన్న మూడు లిప్ లాక్ సన్నివేశాలను మాత్రం మార్చినట్టు తెలుస్తోంది.

సినిమా విడుదల కాకముందే బ్యాడ్ న్యూస్

మరి ఈ లిప్ లాక్ సన్నివేశాలను మేకర్స్ ఎలా రీప్లేస్ చేశారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ఆల్కహాల్ వ్యతిరేక సందేశం ఫాంట్ సైజును పెంచడంతో పాటు సినిమా ప్రారంభంలో డిస్‌క్లైమర్‌ను మార్చాలని సెన్సార్ బోర్డ్ కోరింది. ఈ మార్పులు చేసిన తర్వాతే సెన్సార్ బోర్డ్ నుండి సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది. దీని తర్వాత సినిమా మొత్తం 2 గంటల 22 నిమిషాల నిడివి ఉంటుందని అంటున్నారు.

కానీ నిజానికి ఇది త్రిప్తి ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. సినిమాలో ఉన్న రొమాంటిక్ సీన్ల గురించైనా ఈ మూవీని చూడాలి అనుకున్న వాళ్ళకు సెన్సార్ గట్టి షాక్ ఇచ్చింది. మరి ఈ ఎఫెక్ట్ మూవీపై ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ వచ్చిందంటే సినిమాలో ఎక్స్పెక్ట్ చేసిన సీన్స్ ఏమీ ఉండే అవకాశం లేదు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు