Balakrishna: నన్ను స్ఫూర్తిగా తీసుకోవద్దు.. కొడుకుకి చెప్పిన బాలయ్య.. ఎందుకంటే..?

Balakrishna: తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికీ తన సినిమాలతో అటు అభిమానులను అలరించడమే కాకుండా కుర్ర హీరోలకు దీటుగా పలు సినిమాలలో నటిస్తూ భారీగానే సక్సెస్ లు అందుకుంటున్నారు. వరుస హ్యాట్రిక్ విజయాలను కూడా అందుకున్నారు బాలయ్య. ముఖ్యంగా ఎన్నో చిత్రాలకు సైతం గెస్ట్లుగా కూడా వెళ్లారు. తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఈనెల 31వ తేదీన రిలీజ్ కాబోతోంది. నిన్నటి రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడంతో ఇందుకు గెస్ట్ గా బాలయ్య హాజరయ్యారు.

నన్ను స్ఫూర్తిగా తీసుకోవద్దని నా కొడుకుకు చెప్పా..

Balakrishna: Don't take me as an inspiration.. Balayya told his son.. because..?
Balakrishna: Don’t take me as an inspiration.. Balayya told his son.. because..?

ఈ సమయంలోనే తన కుమారుడు మోక్షజ్ఞ గురించి బాలయ్య కొన్ని విషయాలను తెలియజేశారు.. ముఖ్యంగా తన కుమారుడికి ప్రతిరోజు కొన్ని విషయాలను తెలియజేస్తానని వెల్లడించారు. తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా త్వరలోనే ఉంటుందంటూ బాలయ్య వెల్లడించారు.. అయితే ఎంట్రీ ఇచ్చే సమయంలో తనని స్ఫూర్తిగా తీసుకోవద్దని.. తన కుమారుడికి తెలియజేశాను అంటూ తెలిపారు..

అలాంటి హీరోలే నీకు స్ఫూర్తి..

విశ్వక్, సిద్దు జొన్నలగడ్డ, అడవి శేష్ వంటి యువ నటులను మాత్రమే స్ఫూర్తిగా తీసుకోవాలని తన కొడుకుకి చెబుతూ ఉంటానని తెలిపారు బాలయ్య. కచ్చితంగా ఇలాంటి హీరోలనే నువ్వు స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని సూచిస్తూ ఉంటాను అని తెలిపారు బాలయ్య..

- Advertisement -

విశ్వక్ నా సోదరుడు..

అలాగే హీరో విశ్వక్ గురించి మాట్లాడుతూ.. తనను , విశ్వక్ ను చూస్తే కచ్చితంగా చాలా మంది కవలలు అనుకుంటూ ఉంటారని సరదాగా తెలియజేశారు. ముఖ్యంగా విశ్వక్ తనకు ఒక సోదరుడు లాంటివారని వెల్లడించారు. ఇండస్ట్రీలో తను చాలా తక్కువ మందితో మాత్రమే స్నేహబంధం చేస్తానని.. అలాంటి వారిలో విశ్వక్ కూడా ఒకరని వెల్లడించారు.. ముఖ్యంగా విశ్వక్ లో ఫ్యాషన్, దమ్ము ధైర్యం , మాట్లాడే విధానం, తనని తాను చూసుకున్నట్టుగా ఉంటుంది అంటూ తెలిపారు.

కన్నీళ్లు వచ్చాయి అంటున్న విశ్వక్..

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విషయం పైన విశ్వక్ మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా పెద్ద గాయం అయింది.. ఆ సమయంలో బాలయ్య గారికి ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడాను.. అప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి… నా కుటుంబం తర్వాత నా పై మళ్లీ అంత ప్రేమ చూపించిన వారు బాలయ్య మాత్రమే అంటూ తెలిపారు విశ్వక్.

నా గ్యాంగ్ లో ఆ ముగ్గురే అంటున్న బాలయ్య..

నా గ్యాంగ్ లో ముగ్గురు హీరోలు ఉన్నారు .వారు విశ్వక్ సేన్ , సిద్దు జొన్నలగడ్డతో పాటు అడివి శేష్ .. నా గ్రూప్ లో ఉన్నారు అంటూ చెప్పాడు బాలయ్య

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో విశ్వక్ కి జోడిగా నేహా శెట్టి నటించింది . అంజలి, గోపరాజు రమణ, సాయికుమార్, హైపర్ ఆది కీ రోల్స్ చేశారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకి యువన్ శంకర్రాజ సంగీతం అందించగా.. ఫార్చ్యూన్ ఫోర్ , సితార ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు