Balakrishna : బాలయ్య సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా.. అభిమానితో భోజనం..

Balakrishna : నట సింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తండ్రి లాగే నట సార్వభౌముడిగా అశేషమైన అభిమానులని సంపాదించుకున్నాడు. తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ఆరు పదుల వయసులోనూ దూసుకుపోతున్నాడు. ఇక కొన్నేళ్ల ముందు వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమైన బాలయ్య అఖండ తో అఖండ విజయం సాధించి ఇప్పుడు వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నారు. ఇక ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా ఉండే బాలయ్య అభిమానులతో కొన్ని సార్లు కోప్పడినా, ఆయన నిజంగా ఎంత సరదాగా ఉంటాడో కొన్ని సార్లు పలు వీడియోల ద్వారా ప్రదర్శితమవుతూనే ఉంది. ఇక బసవతారకం ఆసుపత్రి స్థాపించి ఎంతో మంది క్యాన్సర్ పేషేంట్లకి వైద్యం చేయిస్తున్న బాలయ్య అభిమానుల మనస్సులో ఎప్పటికీ నిలిచిపోతాడు. ఇదిలా ఉండగా కొన్నాళ్లుగా ఎన్నికల హడావుడిలో ఉన్న బాలయ్య, రీసెంట్ గానే ఆ పనులు ముగించుకొని తిరిగి షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది.

Balakrishna had lunch with a fan in NBK109 movie shooting gap..

అభిమానితో భోజనం చేసిన బాలయ్య…

ఇక  బాలకృష్ణ (Balakrishna) తాజాగా సినిమాల షూటింగ్ లలో మళ్ళీ పాల్గొంటున్నాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK109 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కర్నూల్ లో జరుగుతుంది. అక్కడ బాలయ్య తన అభిమాని ఫ్యామిలీ ని కలవడం జరిగింది. షూటింగ్ గ్యాప్ లో ఒక ముస్లిమ్ అభిమాని కొడుకుతో బాలయ్య బాబు కలవడం జరిగింది. ఇక అభిమాని ని కలిసిన బాలయ్య ఒక నార్మల్ షార్ట్ తో లుంగీ కట్టుకుని సింపుల్ గా ఇంట్లో ఉన్నట్టు కనిపించాడు బాలయ్య. అక్కడ అభిమాని కొడుకుతో కాసేపు సరదాగా ముచ్చటిస్తున్న వీడియో వైరల్ అవుతుంది. ఇక అనంతరం ఆ ముస్లిమ్ అభిమానితో కలిసి భోజనం చేసాడు బాలయ్య. ఇక ఈ వీడియో చూసిన బాలయ్య ఫ్యాన్స్ తన సింప్లిసిటీకి ఫిదా అయిపోతున్నారు.

- Advertisement -

ఇక కొన్ని రోజులు సినిమాపైనే ఫోకస్?

ఇక బాలకృష్ణ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సందర్బంగా కొన్నాళ్ళు చాలా బిజీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచారాలు చేయగా, ఎన్నికల ఫలితాలు కూడా రావడం, టిడిపి గెలిచి కొత్త ప్రభుత్వం ఏర్పాటవడం చకచకా జరిగిపోయాయి. ఇక ముఖ్యంగా బాలకృష్ణ మూడో సారి హిందూపురం నుండి ఎమ్మెల్యే గా గెలవడం విశేషం. ఎమ్మెల్యే గా ప్రమాణస్వీకారం చేసాక కొన్ని రోజులు అక్కడే ఉన్న బాలయ్య, హిందూపురంలో తన నియోజకవర్గంలో కొన్ని రోజులు ప్రజల సమస్యలపై విచారణ చేసారు. తాజాగా మళ్ళీ సినిమా షూటింగ్ లలో బిజీ అయ్యారు. ప్రస్తుతానికి బాబి NBK109 సినిమాలో మాత్రమే నటిస్తున్న బాలయ్య, ఈ సినిమా షూటింగ్ ముగియగానే, అఖండ 2 సెట్స్ లో అడుగుట్టనున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోయే అఖండ2 సినిమా ఆగష్టు లో ప్రారంభం కానున్నదని సమాచారం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు