Balakrishna : మోక్షజ్ఞ ఎంట్రీ గురించి టెన్షన్ లేదు… ఎంట్రీ డేట్‌తో సహా అనౌన్స్ చేసిన బాలయ్య

Balakrishna.. స్టార్ హీరోల వారసుల కోసం ప్రతి ఇండస్ట్రీలో కూడా వారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక తమ అభిమాన హీరో వారసుడు ఎప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు..? ఎలాంటి కథతో వస్తారు? వస్తే ఎలాంటి విజయాన్ని అందుకుంటారు? ఇలా పలు రకాల అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉంటారు ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి కుటుంబానికి మంచి పేరు ఉంది. ఈ కుటుంబం నుంచి వచ్చిన బాలకృష్ణ(Balakrishna )తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు ఇటీవలే అర్ధ శతాబ్దాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఈయన సినీ జీవితానికి 50 ఏళ్లు.. ఈ క్రమంలోని సినీ సెలెబ్రెటీల్ అంతా కూడా సెప్టెంబరు ఒకటవ తేదీన హైదరాబాద్లో గోల్డెన్ జూబ్లీ పేరిట ఘనంగా బాలయ్యను సత్కరించిన విషయం తెలిసిందే.

Balakrishna : No tension about Mokshagna's entry... Balayya announced with entry date
Balakrishna : No tension about Mokshagna’s entry… Balayya announced with entry date

మోక్షజ్ఞ ఎంట్రీ గురించి టెన్షన్ లేదు..

ఇదిలా ఉండగా ఒకవైపు బాలయ్య హీరో గానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈయన వారసుడు మోక్షజ్ఞ (Mokshagna )ఎప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు అంటూ అభిమానులు ఎదురుచూస్తూ ఉండగా ఎప్పటికప్పుడు కథ సిద్ధమైంది.. వస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇటీవల సెప్టెంబర్ 6వ తేదీన మొదటి సినిమా తో లాంఛ్ కాబోతున్నారు అంటూ వార్తలు రాగా తాజాగా బాలకృష్ణ తన కొడుకు ఎంట్రీ పై స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చారు. బాలకృష్ణ తాజాగా తన 50 ఏళ్ల సినీ ప్రస్థానం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కొడుకు ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. మూడు నెలల్లోనే షూటింగ్ ప్రారంభం అవుతుంది త్వరలోనే సినిమా కూడా ఫైనల్ అవుతుంది. వాడి మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మొదటి సినిమా విడుదల కాకముందే స్టార్ అయిపోయాడు. ఐదారు స్క్రిప్ట్స్ సిద్ధంగా ఉన్నాయి. వాడి లాంచింగ్ గురించి ఎలాంటి టెన్షన్ లేదు అంటూ బాలయ్య తెలిపారు. దీంతో అభిమానులు సందడి మొదలుపెట్టేశారు.

బాలయ్య సినిమాలు..

బాలయ్య కెరియర్.. ఇకపోతే బాలకృష్ణ చైల్డ్ ఆర్టిస్టుగా తాతమ్మకల అనే సినిమా ద్వారా అడుగుపెట్టి తన అద్భుతమైన నటనతో నేడు సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతూ తన మాస్ చిత్రాలతో యంగ్ స్టార్ హీరోలకి కూడా పోటీ ఇస్తూ అత్యధిక కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిరంజీవి విశ్వంభర మూవీకి పోటీగా విడుదల కాబోతోంది. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య ఈ సినిమాతో మరి ఎలాంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు