Balakrishna On Fire : మందు తాగి హీరోయిన్‌ను నెట్టిన బాలయ్య… స్టేజ్‌పైనే మరీ…

Balakrishna On Fire : బాలయ్య ఎప్పుడూ కోపంగా ఉంటారు, అభిమానులను కొడుతూ ఉంటారు అనే వివాదాలను ఇప్పటి దాకా మనం విన్నాము, చూశాము కూడా. కానీ తాజాగా బాలయ్య మరో వివాదంలో చిక్కుకున్నాడు. స్టేజ్ పై ఏకంగా ఓ హీరోయిన్ ను ఆయన నెట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులోనూ ఆయన తాగి స్టేజ్ పై ఇలాంటి పని చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఇదంతా ఏ ఈవెంట్ లో జరిగింది ? అనే వివరాల్లోకి వెళ్తే…

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్ కు గెస్ట్ గా..

చేస్తున్న ఒక్కో సినిమాతో నటుడిగా తనను తాను కొత్తగా తీర్చిదిద్దుకుంటున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కు రెడీగా ఉంది. డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో అంజలి, నేహా శెట్టి హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా ఈ మూవీకి సంగీతం సమకూరచగా, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగ వంశీ, సాయి సౌజన్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

balakrishna at gangs of godavari pre release event

- Advertisement -

ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. విడుదలకు ముందు అంటే మే 28న నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా గ్రాండ్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. లెజెండరీ యాక్టర్, పొలిటీషియన్ ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా బాలయ్యాను సత్కరించారు.

అంజలిని తోసేసిన బాలయ్య

ఇక ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన బాలయ్య స్టేజ్ పై ఫోటోలు దిగుతున్న క్రమంలో అంజలిని సడన్ గా నెట్టేసి షాక్ ఇచ్చాడు. ఆయన హీరోయిన్లతో మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా ఇలా చేశారు. అయితే ఊహించని ఈ పరిణామానికి తెల్లబోయిన అంజలి పక్కనే ఉన్న మరో హీరోయిన్ ను పట్టుకొని నిలదొక్కుకుంది. లేదంటే ఆమె కాస్తలో స్టేజ్ పై నుంచి పడిపోయేది. అయితే నందమూరి అభిమానులు ఆయన ఏదో సరదాగా అలా చేశాడు అని కవర్ చేసుకోవడానికి వీలు లేకుండా బాలయ్య మందు తాగి ఆ మత్తులోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్టేజ్ పై ఇలాంటి పిచ్చి పని చేశాడు అంటున్నారు నెటిజన్లు. అంతేకాకుండా ఈవెంట్ లో మందు కలిపి ఉన్న బాటిల్ ను వీడియోలో చూపిస్తున్నారు. దీంతో స్టేజ్ పై బాలయ్య ఇలా విచిత్రంగా ప్రవర్తించడం ఎప్పుడు మానుకుంటారో అంటూ విసుక్కుంటున్నారు మూవీ లవర్స్.

బాలయ్యపై ట్రోలింగ్

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు బాలయ్యను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. మాన్షన్ హౌస్ బాలయ్య ఆన్ ఫైర్, సినిమా ఫంక్షన్ లో తాగి హీరోయిన్ ను తోసిన బాలయ్య, మళ్ళీ వీళ్ళే విలువలు, సాంప్రదాయం గల కుటుంబాలు అంటూ బిల్డప్ కొడతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య మధ్య నడుస్తున్న విబేధాల నేపథ్యంలో తారక్ ఫ్యాన్స్ అయితే దారుణంగా బాలయ్యపై సెటైర్లు వేస్తున్నారు. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు