Balakrishna: బాలకృష్ణ కోసం స్క్రిప్ట్ రెడీ చేసిన సీనియర్ దర్శకుడు, కానీ ఇప్పుడు బాలయ్య చేస్తాడా.?

Balakrishna: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పటికీ కొన్ని కాంబినేషన్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్, సుకుమార్ అల్లు అర్జున్ ఈ కాంబినేషన్ లో సినిమాలు వచ్చినట్టు. ఒకప్పుడు కోదండరామిరెడ్డి మెగాస్టార్ చిరంజీవి, బిగోపాల్ బాలక్రిష్ణ ఇలా కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ సాధించేవి. బిగోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఏకంగా ఐదు సినిమాలను చేశారు. ఈ సినిమాలలో నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ప్రస్తుతం బి.గోపాల్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆహా లో ప్రచారమైన అన్ స్టాపబుల్ అనే షో తర్వాత క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ తర్వాత చేసిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ ను సాధించుకుంది. ఇక ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇది బాలకృష్ణ కెరియర్ లో వస్తున్న 109వ సినిమా, ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

Balakrishna

- Advertisement -

ఇకపోతే సీనియర్ దర్శకులు బిగోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా చేస్తారు అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఒకవైపు నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో బిజీగా ఉన్నారు. యంగ్ డైరెక్టర్స్ సినిమాలు చేసుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ టైంలో ఒక సీనియర్ దర్శకులకు అవకాశం ఇచ్చి సినిమా చేస్తారా అనేది చాలామందికి ఉన్న డౌట్. అయితే వీరి కాంబినేషన్ కి మంచి సక్సెస్ రేట్ ఉంది ఒకవేళ సినిమా చేసినా కూడా ఇది హిట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు