Balakrishna: నువ్వు ఎప్పుడూ ప్రజల హీరోవే నాన్న.. బ్రాహ్మణి ఎమోషనల్ ట్వీట్..!

Balakrishna.. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. మొత్తం 172 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సభ్యులుగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలోనే హిందూపురం శాసనసభ్యుడిగా ముచ్చటగా మూడోసారి నందమూరి బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు.. ప్రొటెమ్ స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాలయ్యతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు.. దీంతో బాలయ్య కి పలువురు సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బాలకృష్ణ పెద్ద కుమార్తె.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు.. నారా బ్రాహ్మణి తన తండ్రి గొప్పతనాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేసింది.

నువ్వు ఎప్పుడూ ప్రజల హీరోవే..

Balakrishna: You are always people's hero dad.. Brahmani's emotional tweet..!
Balakrishna: You are always people’s hero dad.. Brahmani’s emotional tweet..!

నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న వీడియోని ఆమె షేర్ చేస్తూ..” నాన్నా.. నువ్వెప్పుడూ ప్రజల హీరోవే.. కథానాయకుడిగా .. ప్రజా నాయకుడిగా నిరంతరం ప్రజల హృదయాలలో ఉంటావు.. వారందరినీ సంతోషంగా ఉంచడానికి ఎప్పుడు శ్రమిస్తావు.. ఆల్ ద బెస్ట్ నాన్న” అంటూ ఎమోషనల్ గా వీడియో షేర్ చేస్తూ రాసుకు వచ్చింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

లోకేష్ ను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటాం..

అలాగే మంగళగిరి ఎమ్మెల్యేగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన తన భర్త నారా లోకేష్ కి కూడా శుభాకాంక్షలు తెలిపింది బ్రాహ్మణి..”ఈరోజు నాకు చాలా ప్రత్యేకమైనది .. ఈ ఉద్విగ్న భరిత క్షణాలను మాకు సొంతం చేసిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ కి శుభాకాంక్షలు” అంటూ లోకేష్ ప్రమాణస్వీకారం చేస్తున్న వీడియోని కూడా జత చేసింది నారా బ్రాహ్మణి..

- Advertisement -

స్వర్ణ శకం ప్రారంభమైంది..

అటు తండ్రి.. ఇటు భర్తకే కాదు.. మామయ్యకి కూడా శుభాకాంక్షలు చెప్పింది. కుప్పం ఎమ్మెల్యేగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తన మామయ్యకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది బ్రాహ్మణి.. చంద్రబాబు ప్రమాణం స్వీకారం చేస్తున్న వీడియోని షేర్ చేసిన ఈమె..” ఆంధ్రప్రదేశ్లో ఒక బంగారు శకం ప్రారంభమైంది.. రాష్ట్ర ప్రజలకు ఇక అంతా మంచే జరుగుతుంది.. ఏపీ ముఖ్యమంత్రిగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా మామయ్య గారికి అభినందనలు” అంటూ తన ట్విట్టర్ ద్వారా రాసుకుంది నారా బ్రాహ్మణి.. ప్రస్తుతం నారా బ్రాహ్మణి షేర్ చేసిన ఈ మూడు ట్వీట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

నారా బ్రాహ్మణి కెరియర్..

ఇక నారా బ్రాహ్మణి విషయానికి వస్తే.. సినిమా ఇండస్ట్రీలోకి రాకపోయినా తండ్రి ఇన్ఫ్లుయెన్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.. నారా బ్రాహ్మణి ఒక వ్యాపారవేత్త.. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తుంది.. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ , ట్రస్ట్ కి బోర్డు మెంబర్ కూడా.. ఈమె విద్యాభ్యాసం విషయానికి వస్తే .. స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి 2013లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసి.. కొంతకాలం వెర్టెక్స్ వెంచర్ మేనేజ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ గా కూడా పనిచేసింది. 2011లో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ గా.. బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ గా బాధ్యతలు నిర్వహించి.. ప్రస్తుతం హెరిటేజ్ న్యూట్రివెట్ లిమిటెడ్ , హెరిటేజ్ ఫిన్ లీస్ లిమిటెడ్, నిర్వాణ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, మెగా బిడ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ లలో డైరెక్టర్ గా పని చేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు